వ వ్వ వ్వా వ్వాట్ వ్వాటీ వ్వాటీజ్ దిస్? రౌడీ గాళ్ ప్రియ కూడా ఇలా సున్నితంగా అంటోందని భయపదక్కర్లేదు. నేనెవరికీ విషెస్ చెప్పి గుడ్ గాళ్ ని కావాలనుకోటం లేదు కానీ, ఇవాళ నా లా౨ప్ టాప్ కి పుట్టిన రోజు. కేక్ కట్ చేయించి, అడుగరిశలు పోసేంత సన్నివేశం నా దగ్గర లేదు కానీ, ఇది మాత్రం నాకు ఒక అపురూపమైన ఙ్ఞాపకం. ఆ కంప్యూటర్లూ, ఈ కంప్యూటర్లూ పట్టుకుని వేళాడుతూ, ఇబ్బంది పడుతున్నానని తెలిసి ఒక నేస్తం అడగక వరమిచ్చిన దేవత వోలె (ఏంటీ కవిత్వమా? బాప్రే! ఈ పిల్లకి ఏదో ఐందీవేళ అనొద్దు) నాకోసమని కొనిచ్చిన నేస్తమిది.
ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నాకు కంప్యూటర్ గురించి వెతుక్కోవాల్సిన పని లేదు. నెట్ కూడా అందుబాటులో ఉండి నా చదువుకు బాగా సహకరిస్తోంది. ఎంత అలవాటై పోయిందంటే... ఇవాళ దీని కోసమని కొత్త డ్రెస్, నిజమే లా౨ప్ టాప్ బా౨గ్ పాంట్ షర్ట్ మాదిరి ఉన్నది. కొత్త మోడల్ కొన్నాను. ఎప్పుడు వాడుతున్నా ఆ ఫ్రెండే నా పక్క కూచుని నా బాగోగులు చూస్తున్న ఫీలింగ్.
సర్లె మరీ సాగదీస్తే మెలో డ్రామా అవుతుంది. థాంక్స్ అని ఒక్క ముక్క చెప్పి ఊరుకుంటం కాదు నేను చెయ్యాల్సింది. నా చదువుని బాగా నడిపిస్తే, అప్పుడు ఆ నేస్తానికి నేనిచ్చే గౌరవం.
టాటా,
ఆ దీర్ఘ చతురస్రాకారపు చిన్న పెట్టెకి ఓ సారి విషెస్ చెప్పండి :-)










