నా మాతృభాష తమిళం! నేను నా మాతృభాషను ప్రేమిస్తున్నాను. అందరు తమిళ కవులను,కళాకారులను, రచయితలను నేను బేషరతుగా గౌరవిస్తాను. తమిళం లో ఉన్న అన్ని మాండలికాలూ, శైలులూ నాకు సమానమే!
తమిళ భూమి (అక్కడ అదేదో గడ్డ అన్నారు. కడుపులో గడ్డలా అంత నచ్చలా. అలాగని ఆ మాట కర్ధం తెలియదనుకోకండి) మీద అన్ని రంగాలలోనూ తమిళమే వ్యవహారంలో ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను.
నేను నా సహోదర తమిళులతో ఎల్లప్పుడూ తమిళం లోనే (ఒక్క ముక్కినా ఆంగ్లం వాడకుండా తెలుగేయులు ఉండగలరా అని నా అనుమానం. నేనైతే ఒక్క తమిళ్ ముక్కా వాడకుండా తమిళ్ మాట్లాడగలను) మాట్లాడతాను.
వారికి తమిళ్ లోనే లేఖలు రాస్తాను. (తెలుగు రానివారు అది నేర్చుకోవడానికి) (ఈ ముక్క నాకు నచ్చలా. తెలుగుని అది ఇది అని తెలుగేయులే చిన్నబుచ్చుకుంటం ఏమిటి? నన్ను చూడండి ఎంచక్కా ఎలా రాస్తానో!) తమిళ్ రాని వారికి అవసరమైనంత మేరకన్నా నేను తమిళ్ నేర్పుటకు ముందుంటాను. నా ఇతోధిక కృషి చేస్తాను.. (నా తెలుగుభాషకు) (ఇదే నాకు నచ్చలేదు యువరానర్! భాష గురించి ఎవరైనా నా అంటారా? మా అనాలి. ఆమాత్రం కలుపుగోలు తనం లేక పోవటమే తెలుగు గోలు గోలు మంటానికి కారణం) మా తమిళ భాషా వారసత్వానికీ ఎక్కడా, ఏ సందర్భంలోనూ, ఎవరి వలనా అవమానం జరగకుండా అన్ని విధాలుగా జాగరూకత వహిస్తాను.
తమిళ భాష గురించిన సరియైన పరిజ్ఞానాన్ని సంపాదించే నిమిత్తం ప్రేరణ ప్రోత్సాహాలు కలుగజేస్తాను. మా (ఇక్కడా నా అనే వాడారు) తమిళ భాషా వారసత్వాన్ని భావి తరాలకు యథా తథంగా అందించడానికి ఉద్దేశించిన ప్రతి కార్య కలాపానికీ (నా మద్దతు ప్రకటిస్తాను) (నా మద్దతు ప్రకటించటం ఏంటి నా బొంద? ఇదేమన్నా ప్రభుత్వాల వ్యవహారమా?) నా సంపూర్ణ సహాయ సహకారాలని అందిస్తాను. (We have to act. Not preach)
కొన్ని వేల సంవత్సరాల చరిత్ర, సంస్కృతి, సాహిత్య సంప్రదాయమూ కలిగిన తమిళ భాషా వారసత్వం నాకు చాలా గర్వ కారణం! ఈ వారసత్వాన్ని సగర్వంగానూ, బహిరంగంగానూ ప్రకటించుకోవడం నా కర్తవ్యం (విజయ శాంతి సినిమా కాదు. అదో డ్యూటీ లా భావించ కూడదు. సహజాతమైన విషయం లా ఉండాలి. గాలి పీల్చుకున్నంత సహజంగా. అప్పుడే భాషా వికాసం జరిగేది. కర్తవ్యాలని ఎంత బాగా నిర్వహిస్తామో మనకి తెలిసిందే కదా. ఆఫీసుకి వెళ్ళగానే ఓపెన్ చేసేది పర్సనల్ మెయిలే కానీ అసలు పని కాదనేది బహిరంగ రహస్యమే :D) అందుకే ఇలా చదువుకోండి... "నా భాషని ఎంత గౌరవిస్తానో అన్య భాషలను కూడా అంతే బాగా గౌరవిస్తాను. నా భాషని ఎంత మక్కువగా నేర్చుకున్టానో (నా అనగా నా పరంగా అని. నేను నేర్చుకుంటాను అని చెప్పటం అన్న మాట) ఇతర భాషలనీ అంతే మక్కువగా నేర్చుకునే ప్రయత్నం చేస్తాను." ఇది నా కర్తవ్యం కాదు. నాకు ఆనందం కలిగించే విషయం."

జై తమిళ భారతి! జై తెలుగు భారతి! (మరి నేను పుట్టి పెరిగింది ఇక్కడే కదా! నా భాషని చూస్తే మేము తమిళులమని ఎవరికన్నా అనుమానం వచ్చిందా?)
తాడేపల్లి వారికి క్షమాపణలు అంటాననుకున్నారా? హా నెవ్వర్! Imitation is a sort of tribute. Nice line of thinking. My congrats to all of those participated in తెలుగు బాట!