ఈ నెలలో వచ్చిన పది మంచి టపాలని పరిచయం చేయాలనేది ప్రయత్నం. కానీ అదెంతో కష్టం అని నాకు తెలుసు. ఎందుకంటే ఇదివరలో ఈ పనిని నేను పెట్టుకున్నాను. గత సంవత్సరం చివరలో నేను/మేము చూసిన టపాల్లోంచీ బెస్ట్ అనుకున్న వాటిని అక్కా, నేనూ, పెద్దమ్మా, పెద్ద నాన్నా, అమ్మా కలసి జాబితా తీశాము. దాని కోసం ఎన్నో టపాలనీ, బ్లాగులనీ చదవాలి. అదొక్కటేనా? వాటిలోని మెరిట్ స్ నీ, డీ మెరిట్ స్ నీ ఎంచాలి. బేరీజు వేయాలి. ఆ జాబితా చేయటానికే... సెలవల్లో ఉన్న అక్క, పెద్దమ్మా, ఆదివారం నాడు పెద్దనాన్నా, కూచుంటేనే ఒక వారం పట్టింది.
అయినా మా ప్రయత్నం వృధా పోలేదు. ఉన్నంతలో మంచి టపాలు వచ్చాయి. వస్తు వైవిధ్యం, artistic merits, literary merits, (కొంచం ఎక్కువైందా?) అన్నింటినీ ఆలోచించి, కొందరు పెద్దలవి తప్పించి (పెద్దలవి అందరికీ తెలుస్తాయి. అదీకాక మేము ఆ సంవత్సరం మొదలైనవి మాత్రం ఎంచుకున్నాము అప్పుడు) అందుకే కొన్ని అన్నోన్ మాస్టర్ పీసెస్ కాకపోతే నేను చూసిన.
పరిధి తక్కువ కనుక అంతకన్నా మంచి టపాలు మిస్ అయి ఉండవచ్చు.
నేను చూసిన పరిధి తక్కువ. అందుకే ఇంకా మంచి టపాలని మిస్ అయి ఉండవచ్చు.
వీలైనంతలో నిష్పాక్షికంగా, కొన్ని ప్రమాణాలని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చాయాలని నా ఆలోచన. వస్తువైవిధ్యం ఉండాలనీ నా ప్రయత్నం. కానీ చేయగలనా లేదా? అని ఒక భావన, భయం. కాకపోతే అనుకున్న పనిని ఎలాయినా చేసేయాలనే ఒక మొండి ధైర్యం నాకు. అందుకే అలా దూకేశాను. ఈ విషయం లో జ్యోతి (గారు) నాకు చాలా సహాయం చేశారు. నా బ్లాగుని అలంకరించతమే కాక, ఈ విషయం లో ప్రోత్సహించారు.
ఇక టపాల విషయానికి వద్దాం. (One to ten or Ten to one order కాదు).
అత్త తిట్టినందుక్కాదుగానీ...తోడికోడలు నవ్వినందుకు ఈ మంట
కత్తి గారు రాసిన ఈ టపాతో జాబితా మొదలు. ప్రత్యేకం గా చెప్పాలా? అందరూ చదివే ఉంటారు. మళ్ళీ ఒకసారి చూడండి. ఈ మధ్య అతిగా ఓవర్ రేటెడ్ ఐన Slumdog Millionaire గురించి, Arvind adiga వ్రాసిన ది వైట్ టైగర్ మీద వస్తున్న విమర్శల పైన వారిదైన శైలిలోవ్యాఖ్యానించారు.
ఈ కధ కు శీర్షిక ఏమ్ పెట్టనబ్బా ?????
ఈ మధ్యన నేను ఎక్కువగా చదువుతున్న బ్లాగుల్లో ఇది కూడా ఒకటి. చక్కటిhomely శైలిలో రాస్తున్నారు. చకగా నవ్వించి చివరలో ఒక సందేశమో... లేకపోతే ఒక చిన్న ట్విస్టొ ఇస్తూ గుర్తున్దేలాంటి టపాలు వ్రాశారు.
డబ్బు వల్లో చిక్కిన జీవితం!
దేనిగురించో అర్ధం అయి ఉంటుంది. సుజాత గారు రాసిన టపా. ఈ మధ్య ఎక్కువగా రాయటం లేదు. వారి ఫ్రెండ్ మరణం గురించి రాసింది కూడా కన్సిడర్ చేశాను కానీ ఇది కాస్త నచ్చింది. Personal favorite. అయినా క్వాలిటీ మిస్ కాలేదు. :-)
ఈ మధ్య ఒక మంచి రీవ్యూ కూడా కొట్టేశారు.
సుజాత గారి ఇడ్లీ కి ఆ రీవ్యూ పచ్చడి కూడా చాలా బాగుంది.
అప్పుడేం చేస్తారు?
మనకి తెలియని వ్యక్తీ కాదు, మనం చదవని టపా కాదు. అయినా ఆలోచింప చేస్తుంది కనుక మరో సారి అలా ఓ లుక్కేద్దాం. ఎంతో ఆలోచింప చేసిన టపా.
గ్లోబలైజేషన్-ఇండియా- అమెరికా....
మధురవాణి గారు ఏమీ రాయలేదు. జస్ట్ అలా అందించారు. మంచి లింక్. మంచి పోస్ట్. అంతే. బాంది కదా?
ఎక్కువ మంది చూడలేదు.
సంబరం... Celebration of life
(ఎక్కువ మంది చూడలేదు కనుక ఒక చిన్న విశ్లేషణ).
జాబితాలోని తొలి కవిత. కవిత కుదరలేదని కవయిత్రి అన్నారు. కుదిరిందో లేదో పెద్దలే నిర్ణయించాలి. కానీ నాకు మాత్రం ఒకటి 'అర్ధం' అయింది. తెలుగులో అనువదించిన సృజన గారూ, ఆంగ్లం లో అంత aggressive style లో రాసిన వారి 'తను' గారూ జీవితాన్ని ఎంతగా ప్రేమిస్తారో అని.
చివరి వాక్యాలు చూడండి...
"అప్పుడర్ధమైంది నాకు
జీవితమంటే ఎదో కాదని...
అది ఒక కలల పందేరమని,
అంబరాన్నంటే సంబరమని."
క్రింద ఇచ్చిన ఆంగ్ల ఒరిజినల్ మొదటి లైన్లూ, వ్యాఖ్యలో వచ్చిన చివరి వాక్యాలూ...
Worth read.
Darwinism and “Anti-Darwin”ism
"I was wondering why people lose credibility despite the fact that they researched a lot - just by beginning to criticize others. Criticism isn’t as bad as it appears to be. But, irrational criticism is. "
అంటూ సౌమ్య గారు రాసిన ఆ ఆంగ్ల టపా తప్పక చదవదగ్గది. Darwinism మీద ఇచ్చిన వీడియోలు బోనస్. ఎందుకో ఎక్కువ మంది చూసినట్టు లేదు. An amazingly good post.
"one of the takes is too desperate to prove the other is wrong, instead of showing that they are right……" ఆలోచించ దగ్గ మాటలు.
"అవునసలు ఆకాశమే అందమైన అతివ ఎందుకు కాకూడదు?"
"సరిగంచు చుక్కల బుటాపట్టు చీరలు, చందమామ సింధురాలు,క్రిందున్నవారి రాయబారాలు మోసుకెళ్ళేటి పక్షిగుంపు బారులు,మెరుపు కలల జవాబులు, వలపు తాలూకు ఎర్రెర్రని తనువు అందాలు."అంటూ మరువం ఉష గారు రాసిన కవిత ఈ లిస్టు లో రెండో కవితా ఎంట్రీ.. చాలా బాగుంది.
'పల్లేటి' -- చెదరని, ఎప్పటికీ చెరిగిపోని ఒక జ్ఞాపకం....
నేను చెప్పేకన్నా మీరే చదవండి. మంచి టపా. శేఖర్ గారి టపా ఎన్నో అనుభూతులని కలిగిస్తుంది. బాగానే చదివారు.
ఈ క్రింది టపా గురించి చెప్పేదేముంది?
మీకు తెలుసుగా. :-)
చదువరి గారి నేను చదివిన patrikalu.
ఇదండీ ఈసారి లిస్టు. ప్రతినెలా ఇరవై ఐదు నుంచీ ముప్పై మధ్యలో ఇవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు అంత బాగా కుదరలేదని పిస్తే మన్నించండి. ముందు ముందు బాగా రాయటానికి ప్రయత్నిస్తాను.
ఇవే కాక మరో మూడు టపాలూ కన్సిడర్ చేశాను. అవి వివిధ కారణాల వల్ల ఎలిమినతె అయ్యాయి అంత మాత్రాన బాలేవని కాదు. అవీ ఎన్నదగ్గవే.
నాలో నేను సుజ్జి రాసిన కవిత. మరీ pathetic గా ఉంది. అందుకే వదిలేశాను. But beautiful lines.
శ్రీవిద్య గారి రీసెంట్ టపా. పెట్టేదాన్నే కానీ పల్లేటి నన్ను వెంటాడింది. అందుకే అలా వదిలేశాను.
"విజయ విశ్వనాథం " సీరీస్ లో వచ్చిన నవతరంగం వ్యాసం భలే టెక్నిక్. ఆ సీరీస్ ఒక ప్రయోగం. కానీ కేవలం బ్లాగులకే పరిమితం అనే నియమం వల్ల అది ఆగిపోయింది.
Improvement కోసం మీ సలహాలూ, సూచనలూ ఇవ్వగలరని మనవి.
MOTORCYCLE DIARIES: The Fatal Night - 1
-
Dhanaraj Manmadha Says...
August 24, 2009,
Hyderabad.
టైమ్ పదిన్నర కావస్తోంది. "రేయ్ ధనా! మాస్టర్జీ ఫోన్. అర్జంట్. లేవాలి," అమ్మ
పిలుస్తుంటే కలత నిద్రలోంచ...
15 hours ago










