హాయిగా నవ్వితే తప్పా? ప్రతి విషయాన్నీ సీరియస్ గా తీసుకోవాలా? చదువైందాకా పెళ్ళొద్దంటే తప్పా? రాత్రి పూట మేలుకుని పనిచెయ్యటం తప్పా? ఐడియాలప్పుడేగా ఫ్లో అయ్యేది!!!
ఇంకో బాధుందిక్కడ. మగ్ద్లలీనా ఎంతసేపూ తన బాయ్ ఫ్రెండ్ గురించి సోది చెప్పేస్తుంటుంది. అందుకే అది ఉన్న టైమ్ లో నిద్ర పోయి అది బైటకెళ్ళగానే చదూకోటం అలవాటైంది.
హాయిగా నవ్వాలంటే ఏంటా పని చిన్నపిల్లల్లా? అనే మాటొకటి. హుందాగా ఉండాలి. అలా ఉండకూడదు. ఇలా ఉండకూడదు. ఏంట్రా బాబోయ్! అందరూ తలంటినోళ్ళే.
ఏదో పాపం సరదాగా బావగారికి అక్కి తిక్కి లాగా ఫోన్ చేస్తే తప్పట. ప్రియ is a very bad gal అని టాం టాం. (of course అది నేనూ ఒప్పుకునే విషయమే అనుకోండీ). కానీ మరీ అంత పబ్లీగ్గా చెప్పాలా? (మనలో మాట. ఎవరికీ చెప్పకండేఁ!)
సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను.
1. అవసరమున్నా లేకున్నా అతి సీరియస్ గా ఉండాలి.
2. అస్సలు నవ్వకూడదు. ప్రతి దానికీ కోపంగా చూడాలి.
3. బిర్ర బిగదీసుకుని ఉండాలి. అదే హుందాతనం అని చాటాలి. వయసుకు తగ్గట్టుగా సరదాగా జోవియల్ గా అస్సలుండకూడదు.
4. ప్రతి విషయానికీ గ్రాంధిక భాషలో ఉపన్యాస ధోరణిలో మాట్లాడాలి.
5. నా పిల్లలకి చదువాపేసైనా సరే పెళ్ళి చేసి, జనానికి సమాధానం చెప్పాలి.
ఇలా ఎన్నో తీర్మానాలు చేశాను కానీ అవన్నీ అమలవుతాయో లేదో చూడాలి. అసలే ఆంధ్రులు ఆరంభ శూరులు అంటారు కదా.
సో, ఇక నా declaration. ప్రియ is serious ఇక పైన.











11 వ్యాఖ్యలు:
PRIYAA.........
ALL THE BEST.
హహహ ప్రియ గారూ మీరు మీకోసం జీవిస్తున్నారు, అవన్నీ జరిగే పనులు కాదు !
ప్రతి విషయానికీ గ్రాంధిక భాషలో ఉపన్యాస ధోరణిలో మాట్లాడాలి.
బహు బాగు బహు బాగు :) :)
-కార్తీక్
ప్రాజెక్ట్ మానేజర్ గా ప్రమోషనొచ్చినట్టుంది మీకు.. కదూ!!!!!
Hamaa eppudu vakari kosam ee pani cheyakudadu... neeku nachinattu ga jeevinchu ade jeevithaniki paramanandam... dEEpU
ఏవండీ జరగని పనులు? జీవని గారూ?
అన్వేషిత గారూ,
నేనింకా చదూకుంటున్నానండీ.
DeepU గారు,
ఠాన్క్స్ (కోటా స్టైల్లో) :-D
సుభద్ర గారు, karthik గారు,
:-)
మీ తీర్మానాలు :)
ఒకటి రెండు రోజులు సీరియస్ గా ఉంటారేమో. ఆ తర్వాత మీ సహజసిద్దమైన ధోరణి మామూలే. అయినా నవ్వి చావలేక లాఫింగ్ క్లబ్లు పెట్టుకుని మరీ నవ్వుతున్న ఈ కాలంలో హాయిగా నవ్వేసెయ్యండి. మిమ్మల్ని తిట్టిపోస్తున్న వారి మొహాలను చూసి మళ్ళీ ఫ్రెష్ గా నవ్వేయండి. దెబ్బకు మీ జోలికి రారు.
ok
bad girl ,
best of luck
ప్రియగారు, అబ్బ ఒద్దులెండి..ఇంత మరీ 'హుందాతనం' మీకు సూట్ అవ్వదు. ఒద్దులెండి. గుడ్ గల్ పేరు లేకపొతే ఏంటట!
Post a Comment