Wednesday, May 27, 2009

టాప్ టెన్ తెలుగు టపాలు (నేను చూసినంతలో)


ఈ మధ్య కాలం లో వచ్చిన పది మంచి టపాలని పరిచయం చేయాలనేది ప్రయత్నం. కానీ అదెంతో కష్టం అని నాకు తెలుసు. దాని కోసం దాదాపూ 100 టపాల దాకా చూసి ఉంటాను. వీలైనంతలో నిష్పాక్షికంగా, కొన్ని ప్రమాణాలని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చాయాలని నా ఆలోచన. వస్తువైవిధ్యం ఉండాలనీ నా ప్రయత్నం. కానీ చేయగలనా లేదా? అని ఒక భావన, భయం. కాకపోతే అనుకున్న పనిని ఎలాయినా చేసేయాలనే ఒక మొండి ధైర్యం నాకు. అందుకే అలా దూకేశాను.

అన్నే చూశానోలేదో చెప్పలేను. ఎందుకంటే తెలుగులో దాదాపూ రెండు వందల పైన బ్లాగులు ఉన్నాయి. అన్నింటినీ చూడటం కుదరని పని. అది అందరికీ తెలిసిందే. అందుకే నేను చూసిన పరిథిలో నాకు నచ్చిన పలువురు చదవదగిన టపాలని ఒక చోట ఏర్చి కూర్చాలనే నా ప్రయత్నాన్ని ఆదరిస్తారనే నమ్మకంతో...

ప్రియ అయ్యంగార్.

నోట్: One to ten or ten to one list కాదు. పది మంచి టపాలు. అంతే.

జాబిల్లి కోసం ఆకాశమల్లే (సౌమ్య)

ఆ మధ్య ప్రమదావనం పెట్టుకున్న పాటల సందడి కార్యక్రమంలో వచ్చిన టపా. ఆ టపాలలో అన్నిటికన్నా నాకు బాగా నచ్చిన పరిచయం ఇది. అందరూ బాగానే చేసినా... ఇక్కడ ఇచ్చిన ఈ టపా మాత్రం చాలా బాగుంది. 'మధురవాణి' గారి టపా కూడా చూడదగ్గాడే ఆ సందడిలో.

చదవండి ఇంకోసారి ఆ పాటని వినండి.

*****

తెలుగు పుస్తకం : విలువ Vs ధర అండ్ తెలుగు బ్లాగులు - ఇంగ్లీషు బ్లాగులు (కత్తి మహేష్ కుమార్)

పుస్తకాలనీ, మల్టిప్లెక్స్ లో సినిమాల నీ లంకేస్తూ మన 'master of logic' మహేష్ కుమార్ గారు రాసిన ఈ టపా చాలా బాగుంది. ఎప్పుడు టపాలని ఎన్నాల్సి వచ్చినా వేరి టపా ఒకటన్నా ఉండాల్సిందే. 'మునెమ్మ' గురించి రాసిన దాన్ని నేను పెడదామనుకున్నా అది అసంపూర్తిగా ఉంది. అందుకే వదిలేశాను.

ఈ టపా కూడా బాగుంది. "విషయవైవిధ్యం లో ఇంగ్లీషు బ్లాగుల్లో ఉన్న తరహా తెలుగుకి రాదు, రాలేదు కూడా. కారణం, ఇంగ్లీషు ఒక సంస్కృతికి చెందిన భాష కాకపోవడం. ఇంగ్లీషు కేవలం కొన్ని భావజాలాలకు సంబంధించిన భాషగా మిగలకపోవడం. దాని విస్తృతికూడా అపారం. అందుకే ఆ వైవిధ్యం సంభవం. ........... ఎవరు ఏమన్నా మనం బావిలో కప్పలమే. అదే మన అస్థిత్వం. దాన్ని మార్చాలంటే మందమైన తోలు కాదు కావలసింది, కొత్తను ఆహ్వానించగలిగే భావవైశాల్యం. మనకు అంగీకారాత్మకం కాకపోయినా, alternative ideology అవసరం అనే ఒక సృహ. వ్యక్తుల్ని వ్యక్తులుగా గౌరవించి,వారి భావాలకూ, ఆలోచనలకూ,అభిప్రాయాలకూ విలువనివ్వకపోయినా కనీసం సహించ గలిగే ఔన్నత్యం."

అంటూ చెప్పిన విషయం అందరూ చదవదగ్గది. చదివి ఆలోచించదగ్గది.
*****

నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా. (Naga Muralidhar Namala)

నిజంగానే పొడిచేస్తారేమో అని భయ పడ్డాను. ;-)

"నీలా ఉండాలని ఆ చందమామకి ఎంత ఆశో!పాపం నువ్వే ఒక్కరోజు తనలా ఉండకూడదూ."

చాలా బాగుంది కదూ. చదవండి మళ్ళీ. హాసిని గురించి భలే కబుర్లు చెప్పిన ఈయన కవతలు కూడా రాస్తారని నాకు ఈ మధ్య దాకా తెలీలేదు. అది నా బాడ్ లక్.
*****

నువ్వు నా బిడ్డవి చంటీ. (గీతాచార్య) అండ్ అమ్మంటే యశోదమ్మే! (సృజన రామానుజన్)

ఇది ఇంతకు ముందు వచ్చిందే. కానీ ఒక చిన్న మాయ ఉంది. అక్కడ రాసింది మార్చి, అవసరమైన సంభాషణని ఇరికించటంలో ఆయన ప్రతిభ చూడొచ్చు. ఈ బ్లాగ్ థీం కోసం ఇది పెట్టారట. అప్పుడు దాన్ని ఎవరూ చదవలేదు. :-D ఎప్పుడూ సటైర్లూ, చురకలూ, అప్పుడప్పుడూ సినిమాలూ, రాస్తూ, బాగా వస్తుంది అనుకున్న సమయంలో చక్కగా చెడగొట్టే (నో ప్రాబ్లం. ఆయనే ఒప్పుకున్నారు. కనుక నాకు భయం లేదు ;-)), ఆ ఏముందిలే అనుకునేటప్పుడు చదివితీరాల్సిందే అనే లాగా రాసే గీతాచార్య గారు ఈ సారి ఇక్కడ వారి ఇన్‍హిబిషన్స్ అన్నీ ష్రగ్ చేసి, ఒక చక్కని రొమాన్టిక్ శైలిలో ఎక్కడా బిగి సడలకుండా, ప్రశ్నా సమాధానం మాదిరిగా రీజన్ ని బేస్ చేసుకుని అమ్మంటే అన్వేషించి మనకి చెప్పారు.

అమ్మని గురించి అంటే ... వద్దులే అక్కడ వచ్చిన కామెంట్లని చూడండి. మీకే అర్ధం అవుతుంది. ’అమ్మ’ గురించి వీరు రాయ దలచుకున్న ట్రైలజీ లో ఇది రెండో టపా. మొదటిది ఇక్కడ చూడొచ్చు.

దానికి కొనసాగింపుగా సృజన గారు రాసిన టపా చాలా బాగా వచ్చింది. "ధీర సమీరే... యమునా తీరే!" తెలుగులో ఒక చక్కని రొమాన్టిక్ బ్లాగ్.
*****

ఆముక్త మాల్యద: మాల దాసరి కథ - 6 (కొత్త పాళీ)

ఇది మనం తప్పక చదవం. ;-) చెప్పటానికేమీ లేదు చదవండి తప్పక. బృహత్తర ప్రయత్నం. దట్సాల్.
*****

కృష్ణుడూదిన వేణు గానం (భావన)

భావన గారి కృష్ణగీతం ఈ మధ్య నేను చేసిన డిస్కవరీ. బాగుందనటం తక్కువే. చదివి ఆనందించండి.

అన్నట్టు ఇక్కడ బ్లాగుల్లో కృష్ణుడి ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు. :-) ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. బాంది. బాంది.
*****

ఊసుపోక – Parallax error (Malathi)

ఇక్కడ ఈ టపా లేకపోవటమే Parallax error. సో. చెప్పే అంత సన్నివేశం నాకు లేదు. మీకందరికీ తెలుసు.
*****

అమ్మ - నాకు ప్రాణం పోసిన నా బంగారు తల్లి..! (మధుర వాణి)

సుమధురవాణి గారు అందించిన ఈ టపా... ’మదర్స్ డే’ సందర్భంగా వచ్చింది. అప్పుడు నేనూ రాద్దామనుకున్నాను. కానీ నా పేపర్ పబ్లిషింగ్ సందర్భంగా ఉండటంతో కుదరలేదు. సో ఇప్పుడో రేపో నేనూ ఒక టపా రాస్తాను.

మధురవాణి గారి narration అదుర్స్. ఏమాత్రం హెచ్చుతగ్గులు లేకుండా, స్మూత్ గా బాగుంటుంది. ఈ టపా ఆపకుండా చదివించింది. మళ్ళీ మళ్ళీ నేను చదివిన టపా ఇది.
*****

నీరాకతో..... (పద్మార్పిత)

పద్మార్పిత గారి కవితలని చాలాకాలం గా చదువుతూనే ఉన్నా. ఈ మధ్య మాత్రం మిస్సయ్యాను. ఈ పోస్ట్ కోసం నేను చేసిన అన్వేషణ లో చూశాను. బాగుందనిపిందిందంతే.
*****

రెండు చర్చలు (చదువరి)

చదువరి గారు చదివించిన టపా ఇది.
*************************************************************

ఇవండీ, అదీ సంగతి. మరొక్క సారి చదివి ఆనందించండి. తీరిక ఉన్నప్పుడు.

ఇవే కాకుండా మరికొన్ని మంచి టపాలూ ఉన్నాయి.

ఖడ్గగీతం ఇదొక మాయా గీతం. చూడండి మీకే తెలుస్తుంది. ట్రిపుల్ ధమాకా...

సుజ్జి April 12 రాసిన కవిత. కనీసం లింకు ఇవ్వటానికైనా లేకుండా రాసినందుకు నా నిరసన వ్యక్తంచేస్తున్నా. ;-)

మలక్‍పేట్ రౌడీ గారు రాసిన ఎపిక్ ;-D టపా ఇది. చాలా ఇన్ఫర్మేటివ్.

మోనికా నన్ను మన్నించు సెలెస్ Excellent psychological analysis. దాదాపూ ఆరు నెలల తరువాత ’వింబుల్డన్ విలేజ్’ లో వచ్చిన మేజర్ టపా. ఆసాంతం చదివించేలా ఉంది.

విషయం అర్థం అయి ఉంటుంది కనుక, ఇక పైన ఉపోద్ఘాతాలు లేకుండా నేరుగా రంగంలోకి దిగుతాను. నావీ చాలా టపాలు ఉన్నాయి. ఈ నాల్రోజుల ఖాళీ లో రాసేయాలి.

11 వ్యాఖ్యలు:

oremuna on May 27, 2009 5:18 AM said...

చాలా మంచి ప్రయత్నం.
ఇటువంటి టపాలు మరిన్ని రావాలి.

కత్తి మహేష్ కుమార్ on May 27, 2009 7:24 AM said...

మిస్సైన మంచి టపాలు చదవడానికి ఇలాంటి ప్రయత్నాలు కావాలి. పొద్దువారు చేసేవారుగానీ ఈ మధ్య మానేశారు.

...Padmarpita... on May 27, 2009 9:59 AM said...

ప్రియగారు... మీ టపా ద్వార నేను మిస్సైన మంచి టపాలని చూడగలిగాను.
ధన్యవాదాలండి!!!!

te.thulika on May 27, 2009 3:46 PM said...

ప్రియ గారూ, నన్ను కూడా మన్నించినందుకు సంతోషం. పైవ్యాఖ్యాతలు చెప్పినట్టు ఇలా కొన్ని టపాలని ఎత్తి చూపుతున్నప్పడు ఎలాటి టపాలకి ఆదరణ ఎక్కువగా వుందో తెలిసే అవకాశం వుంది.
అభినందనలు

భాస్కర రామి రెడ్డి on May 27, 2009 9:33 PM said...

ప్రయత్నం బాగుంది.
నాకొక సందేహం... ఏ ప్రాతిపదికన ఈ లెక్కలు గట్టారో కూడా చెబితే చదవాలని కోరిక :)

sujji on May 29, 2009 8:15 AM said...

Good efforts.!

Thanks for mentioning my blog.
BTW, http://naalonenu-sujji.blogspot.com/2009/04/blog-post.html is the link of that post. :)

Srujana Ramanujan on May 29, 2009 9:43 AM said...

అంతా కృష్ణ మాయ :-)

మధుర వాణి on June 2, 2009 12:40 PM said...

ప్రియ గారూ,
ఆలస్యంగా వ్యాఖ్య రాస్తున్నందుకు క్షమించగలరు.
మీ టాప్ టెన్ లో నా టపా కూడా ఉండటం సంతోషకరం. అయితే అంతకంటే ఎక్కువగా నా టపా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చదివించింది అన్న మాట ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పలేను. మా అమ్మ కబుర్లు మీ అందరికీ కూడా ఇంత మంచి అనుభూతిని ఇవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది.
మీరు చూపిన చక్కటి టపాల్లో నేను చాలా మిస్ అయ్యాను. ఇలాంటి మంచి మంచి టపాలు మళ్ళీ మాకు చదివే అవకాశం కలిగిస్తున్నందుకు ధన్యవాదాలు. మీ ప్రయత్నానికి అభినందనలు.

భావన on June 15, 2009 8:01 AM said...

ప్రియ సారి లేట్ గా వ్యాఖ్య రాస్తున్నా. నా టపా ను కూడా మన్నించినదుకు ధన్య వాదాలు.. మంచి ఆలోచన ఎక్కడైనా మంచి టపా మిస్స్ ఐనా చదువుకోవచ్చు తరువాత.. నెనర్లు..

MURALI on July 31, 2009 11:49 AM said...
This post has been removed by the author.
MURALI on July 31, 2009 11:50 AM said...

Sorry for the delayed response.

Thanks for your kind words on my post

నేను కవిని కాదన్నవాడ్ని కత్తితో పొడుస్తా.

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez