Friday, April 10, 2009

Song


మురారి లో ఈ పాటనే నాకు చాలా ఇష్టం. సిరివెన్నెల కురిపించిన అందాల పున్నమి. మణిశర్మ సంగీతం, కృష్ణ వంశీ చిత్రీకరణ, మహేష్, సోనాలీల నటనా చక్కగా కుదిరిన ఈ పాట ఒక్కసారి ఆస్వాదించండి మరి. పాట హమ్ చేద్దామని ఉందా? కింద చూడండి.


video



గోగులు పూచె గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడి (2)


పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చా గుమ్మాడి

పుత్తడి వెలుగులు హ్మ్మ్ మ్మ్హొ ఓ లచ్చా గుమ్మాడి





అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే

అమ్మాయికే అర్ధానివే మాటున్న మనసున్న ముత్యానివే

ముద్దొచ్చినా గోరింటవే కట్టున్న బొట్టున్న గోదారివే

అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే

అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది

చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ





నువ్వు పిలిచేందుకే నాకు పేరున్నదీ

నిన్ను పిలిచేందుకే నాకు పిలుపున్నదీ

నిన్ను గెలిచేందుకే నాకు పొగరున్నదీ

ఒక్కట్టయేందుకే ఇద్దరం ఉన్నదీ

నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవి

నీ స్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నవి





వెల వెల వెల వెల ఉప్పెన నేనై వస్తా

నే కల కల కల కల మోముని చూస్తూ ఉంటా

గల గల గల గల మువ్వని నేనై వస్తా

నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా

కస్తూరిలా మారి నీ నుడుటనే చేరి కడదాక కలిసుండనా

కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా

నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లొ చోటున్నది

నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది

అలా అంటు నా చేయీ ఒట్టేసేందుకే ఉంది

చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ


"కస్తూరిలా మారి నీ నుడుటనే చేరి కడదాక కలిసుండనా
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా"


అబ్బబ్బ. సిరివెన్నెల మనసునలా కోసేశాడండీ. అంటే కడదాకా కలిసుండే బంధాన్ని నుదుటన ఉండే కస్తూరి తో పోల్చాడు. చెప్పేకన్నా, విని, ఆనందించండి. మాటలకందని భావాలు అవి. కాస్తలా హం చెయండి.

Note: If song not visible, Ill update it's link again soon. Thank you.

4 వ్యాఖ్యలు:

ఉష on April 10, 2009 10:12 PM said...

మంచి పాట, ప్రియ. మంచి సాహిత్యం. ఆపై ఎన్నో సరాగాల అభినయం కలబోసిన చిత్రీకరణ. మళ్ళీ వినాలనిపించే పాట.

పరిమళం on April 11, 2009 12:28 PM said...

ఉషాగారన్నట్టు చిత్రీకరణ చాలా బావుంటుంది సోనాలి బెంద్రేని అంత అందంగా మరే సినిమాలోనూ చూడలేదు .
"కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా"
beautiful!

చైతన్య on April 13, 2009 4:53 AM said...

nice song...

కస్తూరిలా మారి నీ నుడుటనే చేరి కడదాక కలిసుండనా

చిన్న తప్పు..."నుదుటనే"

కత్తి మహేష్ కుమార్ on May 19, 2009 3:29 AM said...

మంచి పాట. సీతారామశాస్త్రికీ జై!

అలా వెళ్ళొచ్చేవి...

  • MOTORCYCLE DIARIES: The Fatal Night - 1 - Dhanaraj Manmadha Says... August 24, 2009, Hyderabad. టైమ్ పదిన్నర కావస్తోంది. "రేయ్ ధనా! మాస్టర్జీ ఫోన్. అర్జంట్. లేవాలి," అమ్మ పిలుస్తుంటే కలత నిద్రలోంచ...
    15 hours ago
  • సెలవురోజులొచ్చాసాయే బ్లాగు! - మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. ఈ వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక ...
    1 day ago
  • వోట్లు- చెప్పరాని పాట్లు! - "చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?" "మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు" "అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి" "అవకాశం మీది....
    1 day ago
  • గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు - ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి *"గొడ్డుమాంసం - ఒక సంస్కృతి"* అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధ...
    2 days ago
  • బండీ రా.. పొగబండీ రా.. - శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే ...
    3 days ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez