Sunday, March 15, 2009

అక్క పెళ్ళితో నా బాధ్యత తీరింది.


ఎన్నో ఏళ్లుగా నా కళ్ళలో కుంకుడుకాయ రసంలా ఎంతో భారంగా ఉన్న మా అక్క పెళ్లి ఈ మధ్యనే అయింది. ఈ మధ్యనే అంటే ఎలక్ట్రానిక్ మధ్యనే అని కాదు. కొన్నాళ్ల క్రితం అయింది. దాంతో నా బాధ్యతా తీరింది. ఇక నాకు లైన్ క్లియర్.

అసలు పెళ్ళే వద్దన్నది ఇప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఉంది. సరే. ఇంతకీ పెల్లెప్పుడైన్దంటారా? ఈ ఫిబ్రవరి 27 న విజయవాడలో. తరువాత మేమందరం కంచి వెళ్ళాం. అది మా నాయనమ్మ సొంతవూరు.

చాలా కాలానికి ఇండియా కి వచ్చానన్న సంతోషం ఒక ప్రక్క, అక్క కి పెళ్ళి వెళ్లి పోతుందనే బాధ మరో పక్కా, మంచి కుటుంబంలోకి వేల్తోండానే ఆనందం ఇంకోవైపూ... ఇలా ఇదంతా mixed emotions. మొత్తానికీ నా స్టైల్ లో ఏడవకుండా (నాకు డుపంటే యాక్.) ఎలాగోలా (అబ్బ. గోలంటే గోల కాదండీ బాబూ. ఎలాగో అలాగా) నడిపించి మొత్తానికీ కుంకుడు కాయ రసం కదిగేసుకున్నాను.

మామూలుగా పెళ్ళంటే... బంధువులూ, ఫ్రెండ్సూ వస్తారు. కానీ ఈ సారి కొత్తదనం (మిస్సయిందనుకొండీ) తెలిసిన బ్లాగర్లని పిలవటం. మాకు ఎవరూ అంతగా తెలియదు. రాసేదే తక్కువ. చూసేది ఎవరు? అంటే ఏమిచేయగలం? నవ్వుకోవటం తప్ప.

అందుకే నేను సీనియర్ బ్లాగర్ జ్యోతికి తెలియజేశాను. (సారీ జ్యోతి గారు). వారు ఎంతో వేగంగా స్పందించి అక్కకి ఆశీస్సులు, విషెస్ అందించారు. అందుకు కృతజ్ఞతలు.

ఇంతలో అక్క క్లాస్ మేట్ ప్రీతీ కతియా వచ్చింది. వాళ్ల అన్నయ్యతో కలసి. దాంతో అక్కకి గీతాచార్య గారు గుర్తుకు వచ్చి ప్రీతీ చేత ఆయనకీ ఫోను చేయించింది. (ఆయన ప్రీతీ గారి ఫ్రెండ్ ట. ఒకసారి ఆయనని అక్క వాళ్ల ఇంట్లోనే accidental గా మీట్ అయిందట. శుభలేఖ పంపిందనుకోండి). internal exams హడావిడిలో ఉండి రాలేక పోతున్నానని చెప్పి ఫోనులోనే శుభాకాంక్షలు చెప్పారు. బావగారు కూడా ఫోనులో మాటాడితే ముందు చెప్పి ఉంటే వంటల పుస్తకం పంపేవాడిని అని జోక్ చేశారు.

ప్రీతీ వాళ్ళకి మా అయ్యంగార్ల పెళ్లి బాగా నచ్చిందని అన్నారు. అన్నీ సంప్రదాయప్రదంగా జరిగినా ఎవరికీ బోరు లేకుండా బాగా సరదాగా జీవితాంతం గుర్తు ఉండేలా జరిగింది. అలా నా బాధ్యత అంతా తీర్చుకుని ఊపిరిపీల్చుకున్నాను.

మా సంప్రదాయం ప్రకారం ముందుగా కంచి వరదరాజ పెరుమాళ్ ఆశీస్సులకోసం మరునాడే కంచి వెళ్ళాం. అక్కడో చిన్న సర్ప్రైజ్ ఎదురైంది. మా బ్లాగు గురించి సెప్టెంబర్ 25 న ఆంధ్రజ్యోతిలో వచ్చినట్టు ఎవరో మా బ్లాగులోనే ఎవరో చెప్పారు. దాని గురించి మాకు బాగా ఆలస్యంగా తెలియటంతో మాకు ఆ పేపరు దొరకలేదు.

మేము కంచికి బయలుదేరి వెళ్ళే సమయంలో ప్రీతీ వాళ్ల అన్నయ్య వచ్చి అక్కకని ఒక చిన్న కవర్ ఇచ్చారు. అందులో ఒక పేపర్ ఉంది. అది మా బ్లాగు గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన క్లిప్పింగ్ ఫొటోస్టాట్. దాని మీద విత్ బెస్ట్ విషెస్ ఫ్రం గీతాచార్య అని ఉంది. మాకు ఆశ్చర్యం.

"నిన్న కాలేజీ నుంచీ వచ్చాక లైబ్రరీకి వెళ్తే అక్కడ ఐడియా వచ్చి ఫొటోస్టాట్ తీసి మా విని చేత పంపాడు. వాడికి అది అలవాటే. సడన్గా సర్ప్రైజ్ చేస్తాడు." అని వెళ్లి పోయారు.

మాకూ ఎన్ని చదివింపులు వచ్చినా, ఎందరు ఎన్ని గిఫ్ట్ లు ఇచ్చినా ఇది మాత్రం నిజంగానే ఒక సడన్ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎందుకంటే దానిలో మెన్షన్ చేసింది మా నాన్న గారి గురించి రాసిన టపా గురించి. అందుకు వారికి బ్లాగ్ముఖం గా కృతజ్ఞతలు.

అలా ఎన్నో ఆనందాలని అందించి, నా బాధ్యతని తీరిన (చేసిందంతా వాళ్ల నాన్నే అయినా దగ్గర ఉంది చేయించింది (అల్లరి) అంతా నేనేగా. ;-)) ఆ రోజుని నేను ఎప్పటికీ మరువలేను.

పెళ్ళిలో జరిగిన సందడీ, కంచి విశేషాలూ మరో టపాలో.

ప్రియ అయ్యంగార్.

1 వ్యాఖ్యలు:

నాగన్న on March 15, 2009 4:17 PM said...

శుభాకాంక్షలు.

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez