Sunday, December 21, 2008

వైవిధ్య గీతం.


చాలా రోజులైంది నేను రాసి. మళ్ళీ కంప్యూటర్ ముందు కూచున్తానని అనుకోలేదు. ;-)


మొన్నీ మధ్య చెల్లి పెట్టిన ప్రోపోస్జల్ తో మేమెందరం చాలా బ్లాగ్స్ ని చదవాల్సి వచ్చింది. దాంతో ఎన్నో గ్ఫ్నాపకాల్ని తట్టి లేపినట్టయింది. ఎన్ని బ్లాగులని? మరిన్ని టపాలనీ? నేనయితే తపాయిస్తూ, టపా కట్టేస్తూ ఉంటాను కానీ కొందరు మాత్రం చాలా చాలా రాసేస్తున్నారు.


నాకు తెలుగు బ్లాగులు రెండేళ్ళ నుంచే తెలుసు. కానీ ఎక్కువ ఇంగ్లీషు వాటినే చదివి వాటిని కామెంటేదానిని. చాలా సార్లు తెలుగు బ్లాగులు చూసినా తెలుగులో రాయటం బద్ధకం అనిపించి రాయకుండా వదిలేశాను. ఒకసారి చెల్లిని బ్లాగ్స్ ఎందుకు రాయవు అంటే నాకు బోరు అంది. ఎలా అన్నా దానిచేత బ్లాగ్స్ రాయించాలని ఎంతో అది చివరకి తెలుగు దాంతోగురించి చెప్పాను. daantho adi కొంచం ఇంట్రెస్ట్ తో కూచుంది. దానితో పాటూ నన్నూ రాయమంది. సరే అని ఏవో రెండో నూతపదిహెనో అలా రాశాను. ఒకటి తప్ప మిగతావి అంత శ్రద్ధ పెట్టలేదు.

మొన్న చెల్లి టాప్ టెన్ టపాలంటూ ఒక ప్రోగ్రాం పెట్టింది. అవేంటో కొన్నాళ్ళు అందరం చూసి సెలెక్ట్ చేశాం. మీకూ నచ్చాయనే అనుకుంటున్నాం. వీలైనంత వరకూ మంచి టపాలనే తీశాము.

ఇక ఇప్పుడు మన బ్లాగులని నేను ఈ మధ్య ఎక్కువగానే చదివాను. దాదాపూ అందరివీ. అందుకే ఒకసారి సింహావలోకనం చేసుకుంటూ నన్ను బాగా చదివించిన బ్లాగర్లగురించి రాద్దామని మొదలెట్టాను.

ముందు గా నేను చదివింది జ్యోతి గారి టపాలు. మొదట చెల్లికి చూపినవీ ఆవిడవే. మనందరికీ బాగా తెలిసినవి కదా అందుకే ఎక్కువ పరిచయం అవసరం లేదు.

నాకు పర్సనల్ గా అన్నిటికన్నా బాగా నచ్చినవి ఏమిటో చెప్పాలంటే... అప్పుడు ఏమి జరిగిందంటే... మొదలెట్టాలి. చాలా సున్నితమైన హాస్యానికి చిరునామా గా నిలిచిన బ్లాగ్ అది. టపాలు కొన్నే అయినా అన్నీ గుర్తుపెట్టుకునేవే. ఎప్పుడన్నా మూడాఫ్ ఐతే హాయిగా చదూకోవచ్చు. చిన్న చిన్న విషయాలనే రొమాంటిసైజ్ చేసి O.Henry తరహాలో ఉంటాయి.
నేను ఎప్పుడు ఓపెన్ చేసినా చూసేది దీనికోసమే.

అంతే. మిగతావి ఎక్కువ నచ్చిందీ కొత్తవే. ఎందుకంటే వాటిని చూసే మేము బ్లాగటం ప్రారంభించింది. నేను చూసిన ఇన్నాళ్ళలో ఈ సంవత్సరమే ఎక్కువ బ్లాగులు మొదలయ్యాయి. అలాగే అంత కంటెంట్ లేనివీ, మంచి కంటెంట్ ఉన్నవీ. ఊరికినే దొరికిన్దికదాని మొదలెట్టే వాళ్లు కొందరైతే, చాలా సీరియస్ గా మొదలెట్టిన వాళ్లు కొందరు. ఎక్కువ మంది ఒకటి రెండు బ్లాగ్స్ కే పరిమితమై ఉండగా కొందరు మాత్రం నాలుగు ఐదు కూడా మొదలెట్టేశారు.

ఏవో రెండు టపాలు రాసి కామెంట్లు రాక వదిలేసిన వాళ్ళే ఎక్కువ. అది సరైన ధోరణి కాదు. ఎటూ కామెంట్ల దగ్గరకి వచ్చాం కనుక ఈ అంశం మీదే నా అనుభవాలని చెప్తున్నాను.

ఈ సంవత్సరం వాటిల్లో మాకు బాగా నచ్చినవి ఆరు బ్లాగ్స్. వాటిని మా బ్లాగ్ లోనే డిస్ప్లే చేస్తున్నాం కూడా.

మళ్ళీ టపాలో ఆ వివరాలూ, ఇంకా మరిన్ని బ్లాగ్ సంగతులు.

Friday, December 19, 2008

టాప్ టెన్ తెలుగు టపాలు.


మొన్నీ మధ్యన నాకు ఒక ఐడియా వచ్చింది. మన తెలుగు బ్లాగ్స్ చాలా ఉన్నాయికదా! (రాసిలోనూ, వాసిలోనూ, ఇతర దక్షిణ భారతదేశ భాషలకన్నా ఎక్కువే). మనకి గర్వం. mmm. కదూ!


అందులో టాప్ టెన్ టపాలని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఆ విషయాన్ని అక్కకి చెప్పాను. అక్కేమో వాటిని మనమే సెలెక్ట్ చేసే బదులు మనకి తెలిసిన వాళ్ళకీ చూపించి వాళ్ళనే చేయమంటే బావుంటుందేమో అంది. "ఇదేమైనా జెమిని దసరా అవార్డులా అందరినీ చేయమనేందుకు?" అన్నాను నేను. "అందరూ అంటే అందరూ కాదే మొద్దు మొహం (ఈ మధ్య వర్క్ ఎక్కువై నిద్ర తగ్గి మొహం ఉబ్బినట్లు ఐందిలే.) అందరికీ బ్లాగ్ లంటే తెలియ వద్దూ. అందుకే మన మన అమ్మలకీ, మా నాన్నకీ, పెరుమాళ్ గాడికీ (తమ్ముడు . శ్రీనివాస పెరుమాళ్ వాడి పేరు) చూపించి చదివి సెలెక్ట్ చేయమందాం.," అంది.


"ఐడియా బానే ఉంది కానీ ఎవరు చదివేరు?"


"అందరూ ఈ మధ్యన చూస్తున్నారు."


సరే కానీయమని తనకి ఆ పనిని అప్పజెప్పాను. అలా మొత్తం ఆరుగురు కలసి ఎంపిక చేసిన టపాలే నా బ్లాగ్ లో పెట్టిన టాప్ టెన్ టపాలు. వాటి గురించి ఇయరెండ్ సందర్భంగా ఓ పరిచయం. తీసుకున్నవన్నీ చాలా వరకూ ఈ సంవత్సరం ప్రారంభించిన బ్లాగ్స్ నుంచే. ఇక చూద్దామా?

****************************************************************



అన్నిటికన్నా పైన ఉన్నది నాకు బాగా నచ్చిన టపా. ఎవరూ సెలెక్ట్ చేయరేమో అనుకున్నా. నా టేస్ట్ అలాంటిది. దానికి తగ్గట్టుగానే ఎక్కువ కామెంట్స్ పడలా. దీని గురించి ఎక్కువేమీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే నా మొదటి tఅపానే దీని గురించి. నా బ్లాగ్ లో చూడండి.




అసలు టపా అంటే ఇదీ. ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. సుజాత గారి ఆవేదన దేవుడు అర్ధం చేసుకున్నాడా అన్నట్టుగా ఆ తరువాత కొద్ది రోజులకే తెలుగుకి ప్రాచీన హోదా వచ్చింది. :-) తెలుగులో one of the prolific, and powerful writer. అందుకే అలా అలవోగ్గా కామెంట్స్ ని కొల్ల గొడుతున్నారు.




దీని గురించి చాలా చెప్పాలి. టెక్నిక్ అద్భుతం. అలా కేవలం సంభాషణతోనే ఎంతో భావాన్ని, డెప్త్ తో చెప్పటం, కథని నడిపించటం కష్టం. మనకీ అక్కడే ఉన్నా భావాన్ని కలిగించి, తాను చెప్పిన విషయాన్ని మనకూ అనుభూతింప చేయటం great. Inimitable style.




చెప్పాలా ఎవరు రాశారో? వద్దన్నా చదివి మళ్ళీ కామెంట్ రాస్తారు. చాలామంది. కత్తి లాంటి టపా. టపా కన్నా నాలుగైదు కామెంట్స్ బాగున్నాయి. అవే టపాకి అందం తీసుకోచాయి. టపా బాగుండటం కాదు. రాసిన విధానం, స్పందన రప్పించిన (క్షమించాలి. మహేష్ గారి టపాని చదివి స్పందించకుండా ఉండటం కష్టం అందుకే అలా అన్నాను. ఎవరి మనసునైనా నొప్పిస్తే సారీ).




అసలు ఎవరూ పట్టించుకోని మాస్టర్ పీస్ ఇది. రాస్తే ఈయనే రాయగలరు అనే ఆలోచనలు అందులో ఉన్నాయి. చదవకపోవటం మన దురదృష్టం. అంతే.


"దేవుడు అందరి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. నాకు మళ్ళీ అర్ధం కాలేదు. అసలు దేవుడంటే సర్వ శక్తిమంతుడు అంటారు కదా? మరి ఆయన అందరి వద్దా ఉండలేడా? ఆ ఆలోచనే ఫూలిష్నెస్స్. మరి అమ్మ ఎందుకు? ఆలోచించాల్సిన ప్రశ్నే!" ఈ తరహా ఆలోచన, అమ్మ చేతి ముద్దా గొప్పతనాన్ని గురించి చెప్పిన తీరూ, చదవక పోతే అది మన bad luck. అంతే.


మావి తప్ప వేరే ఎ కామెంట్స్ లేక పోవటం ఆశ్చర్యమే మరి.**




"Decisions are to be made quick." చదివే వారిని ఉలిక్కి పడేలా చేసిన టపా అది. నిజంగా జరిగితే మాత్రం చాలా ఆనందదాయకమైన సంగతి అది. సృజన గారి శైలి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తున్నదంటే... చదివిన వాళ్లు ఫ్లాట్. చదివి ఆనందించండి అంతే. చెప్పటం కుదరదు. కష్టం. ఎందుకంటే టపాలోని ప్రతి వాక్యం చెప్ప దగినవే. వారి ఇష్ట సఖుడు సజెస్ట్ చేసిన స్టైల్ త అది. ఆయనా రాస్తారేమో? ఎవరైయ్యుంటారబ్బా! మన బ్లాగ్స్ లో అలా రాసేవాళ్ళు కనబడలా నాకు).




టైటిల్ చూడగానే గుర్తుకు వచ్చే పేరు ఆ బ్లాగ్ ది. కొందరికి చాలా ఇష్టమైన బ్లాగ్ అది. అక్క అది తప్ప వేరేవి చాలా తక్కువ చదవటం తెలుగు బ్లాగ్స్ లో. దానికి ఇంగ్లీష్ ఎక్కువ ఇష్టం.


'విజేతల స్వర్గ ధామం - వింబుల్డన్ విలేజ్'. అది థీం. తెలుగులో ఏకైక sports blog. We have no such blogs on sports exclusively. ఈ టపా చదివితే మనకీ ఆ రోజు మ్యాచ్ ని చూసిన అనుభూతి కలుగుతుంది. టైటిల్ లో పన్ బాగా పండింది.




తల్లీ బిడ్డల ఫోటో తో పాటూ చాలా అందమైన భావాలూ, అనుభూతులూ... చదివి ఆనందించాల్సిందే. ముద్దబంతి గారి టపాని చూడగానే ఎంతో ఆనందం కలిగింది. ఎందుకో రాయటం లేదిప్పుడు. A cool blog of beautiful emotions.




ఎందులోనో జ్యోతి గారి సమీక్ష చదివి అక్క లింక్ వెతికి పంపితే చదివాను నేను. మంచి టపా. ఆలోచింప చేసిన టపా. రమణి గారిది.




ఆ సీరీస్ అంతా చాలా discussion పెట్టించింది. ఎన్నో విషయాలు బైటకి, చర్చకీ వచ్చాయి. జర్నలిజం లోని అంతర్గత విషయాల్ని నిర్భయమ్గా రాయటం ఆ గుంటూరు మిరపకాయ (సారీ మా అమ్మ అన్నది చదివి) గారికే చెల్లు.


***************************************************************


ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. కానీ వైవిధ్యం, వస్తువు, టెక్నిక్, లని ఆలోచించి తీసుకున్నవి ఇవి. మీవి రాందే నన్ను కొట్టొద్దే.

సుజ్జి గారు రాసిన ఈ నాలుగు లైన్లూ చూడండి.

నాది కాని లోకంలో
ఏ మనిషిని వెతకను..??
నీళ్ళు లేని సంద్రంలో
ఏ నావను నడపను..!!??

అలాగే పూర్ణిమ గారు రాసిన అల్లరిటపా.... మనసునలా ట్విస్ట్ చేశాయి.


అలా వెళ్ళొచ్చేవి...

  • వోట్లు- చెప్పరాని పాట్లు! - "చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?" "మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు" "అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి" "అవకాశం మీది....
    9 hours ago
  • గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు - ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి *"గొడ్డుమాంసం - ఒక సంస్కృతి"* అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధ...
    15 hours ago
  • బండీ రా.. పొగబండీ రా.. - శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే ...
    1 day ago
  • విశ్వామిత్ర-11 - మిత్ర అమెరికాకి తిరుగు ప్రయాణం నాలుగు రోజుల్లోకి వచ్చేసింది. సర్దుకోవటం మొదలుపెట్టిందే కానీ మనసులో ఏదో దిగులు. సుబ్బాలు దగ్గరగా కూర్చుని అన్నీ అందిస్తుంది....
    2 days ago
  • సృజనగీతం: పాడమంది యుగళ గీతం - *సృజన* అనువదించిన ఒక కవిత ఇక్కడ చూడండి. *ప్రకృతిలోని సొగసులు * *నీ నడకలోని హొయలు * *ఆటలాడి వంటరినై ఉన్న* *తుంటరిని చేశాయి* *వంటరినై ఉన్న నన్ను * *మీ ఇద్ద...
    6 days ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez