Tuesday, September 30, 2008

నా గుంపు రెండు గోల


హమ్మాఆఆఅ! వదిలిందండీ బాబూ! పిచ్చి ఎక్కిందంటే నమ్మండి. ఒక వైపు కాలేజ్ లో ఇంటర్నల్స్ గోల మరో వైపు నాన్న పెట్టిన గుంపు రెండు చిచ్చు, హేం చేస్తాం? తహప్పదు. పాడు జీవితమూ చదువులూ....


విషయమేంటంటే మాకు ఇంటర్నల్ పరీక్షలు మొదలయ్యాయి. చదవకుండా సిస్టం ఓపెన్ చేస్తే నాన్న చీరేస్తాడు. అదంటే నాన్న ఏదో చీర ని తీసి నా నెత్తిమీద వేస్తాడని కాదు. మొహం వాచేలా చివాట్లు పెడుతాడు. ఇంటర్నల్స్ కోసమే చదవలేక చస్తుంటే మధ్యలో గుంపు రెండు పరీక్షలోచ్చాయి. ఖర్మ కాకపొతే సెప్టెంబరు ఇరవై నే రావాలా ఆ పరీక్షలు. ఆ వచ్చేదేదో సెప్టెంబర్ ఐదున రావోచ్చుగా? హాయిగా ఇంటర్నల్స్ ఎగగోట్టొచ్చు. మనశ్శాంతి గా ఉండేది. సరే! ఏదో అయిపొయింది కదా అని గుంపు రెండు పరీక్షకి వెళ్లాను.

మనం మొదటి నించీ ఆంగ్ల మాధ్యమం లోనే చదివి పూడ్చింది.

ప్రశ్నా పత్రం తీస్తినో లేదో కానీ హెచ్చరిక! "ప్రశ్నా పత్రాన్ని ఆంగ్లం లోనే సెట్ చేస్తిమి. ఏవి ఐననూ తేడాలోస్తే ఆంగ్లమే ప్రాధాన్యం వహించును."

నాకు మండింది. అసలే నాకు తెలుగంటే మక్కువాయే! అందుకే "My Godd!!!!! తెలుగు కి ఏమిగతి పట్టింది ఆంద్ర దేశం లోనే తెలుగు కి ప్రాధాన్యం లేక పోవడమేంటి? చక్కగా తెలుగులోనే సెట్ చేసి ఆంగ్లానువాదం చేయ వచ్చు కదా! ఎందుకీ ఆంగ్లాభిమానం? this is totally wrong on the part of the AP government. I can't bear this." అని తెగ తెలుగాంగ్లం లో బాధ పడి పోయాను.

ఇది కాకింకో కథ. తెలుగులో తేలిక గా రాయగలిగిన పదాలనీ వాళ్లు ఆంగ్లం లోనే ఇచ్చారు. వుడ్ అలా అన్నమాట. దుంప తెగా అని అనుకున్నాను. అసలు తెలుగులో ప్రశ్నా పత్రాన్ని సృష్టించగల వాళ్ళే మన భాంగ్రా ప్రదేశ్ లో లేరా? ఏమిటీ దుస్సాహసం?

వైష్ణవి హరివల్లభ.

Wednesday, September 17, 2008

అల్లరల్లరై పోయింది. :-)


నేను మొదట్లో మూడు బ్లాగులు రాసి మాయం ఐపోయింతర్వాత తిరిగి వచ్చినప్పుడు మన బ్లాగుల్లో అల్లరి ట్రెండ్ నడుస్తోంది. అల్లారా...నేనా?? అంటూ పూర్ణిమ గారు రాసిన ఒక టపాని చూశాను. (http://oohalanni-oosulai.blogspot.com/2008/07/blog-post_24.html) నా అహం దెబ్బతింది. అస్సలు అందులో అల్లరి ఎంత బాగుందో! నేను మాత్రం తక్కువ తిన్నానా అనిపించింది. నా అల్లరి కూడా మాటల్లో పెట్టేద్దాం అనిపించింది. అది నేను రాస్తే స్వోత్కర్ష లాగా ఉంటుందేమో అని భయం వేసి మా అక్క వైష్ణవిని రాయమన్నాను.

దాంతో తను మొదలెట్టింది. నాకివాళ కొంచం తీరికగా ఉంది. అందుకే బ్లాగుల మీద కూచున్నాను. అల్లరి చేసే ఉద్దేశ్యం ఉండటం తో అల్లరి బ్లాగులని చూద్దామనిపించి, తరువాత చూసిన వాటి గురించి రాద్దామనిపించి... ఇదిగో ఇలా మీతో నేను.

అక్క బాగానే రాసింది. అది నేను రాసింది కాకపోవటంతో చక్కగా దాని గురించి రాయొచ్చు. ముందు మిగతా వాటి గురించి. పూర్ణిమ గారి అల్లరి గురించి మనమంతా చదివిందే.

"అబ్బా ఎప్పుడూ మనుషుల మొహం మీద తిరుగుతూ ఉంటావు.. వచ్చి నా తల మీద కూర్చో సరిపోతుంది" అని నాకు మూడేళ్ళ వయస్సులో విసుక్కుంటున్న పక్కింటి ఆంటీ తల మీద కాలుపెట్టా, నిజంగా కూర్చోటానికి.. ఇది అల్లరి కాదు.. పెద్దల మాట తు.చ తప్పకుండా పాటించడం."

అంటూ ఎంత అల్లరి పెట్టి నవ్వించారని?

పాపం "మనసులోమాట" సుజాత గారి టపా చూసి నాకెంతో జాలేసి సంతాపం తెలుపుదామనుకుని, కానీ ఆ పని వేరే సందర్భాల్లో చేస్తారని ఆగిపోయాను. అస్సలు అవకాశం రాలేదట అల్లరి చేయటానికి. అయినా బ్లాగుల్లో ఆ కొరత తీర్చుకుంటారని ఆశిస్తున్నాను.

అల్లరంటే నాకు గుర్తొచ్చే బ్లాగు "బ్లాగు వనం" అందులో శ్రీవిద్య గారు చేసే అల్లరి నిజం గా అద్భుతం. బడి ఎగ్గొట్టానికి వేసిన ప్లాన్ గురించి రాసిన బ్లాగ్ తెగ నవ్వించింది.

(http://srividyab4u.blogspot.com/2008/07/blog-post_2968.html)

ఎంత మూడాఫ్ అయినా ఈ టపా చూస్తే మనం నవ్వుకోవచ్చు. ఇంచక్కా! :-)

అప్పట్లో రోజుకి ఒకసారైనా చదివాను. ఆ టపాని.

ఈ టపాలన్నిటినీ చూసి నాకూ బ్లాల్లరి చేయాలని పించింది. దాంతో అర్జంటు గా అక్కని రాయమన్నాను. అక్క మొదలెట్టేసింది.

"ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా
నలుపు నలుపేకానీ తెలుపు కాదు.
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినరాసుమతీ."


అంటూ చిన్నప్పుడు తను తప్పు చెప్పే పద్యం తీసుకుని మేము చేసిన 'నభూతో...' అనిపించే ప్రయోగాన్ని భలే వివరించింది. (కొంచం ఎక్కువైంది కదా!!!) ;=)

"ఒకసారి ఈ పద్యాన్ని పరీక్షల్లో ఇచ్చారు. ఎలాగో ప్రియ చూపించటంతో బ్రతికిబట్టకట్టాను. లేకపొతే ఎలిజబెత్ టేలర్లా పుణ్యవతీ టీచరు నాకు ఎనిమిదోపెళ్లి చేసేది కూడా. సెవెన్ పెళ్ళిళ్ళు జరిగాయి. జస్ట్ రికార్డ్ మిస్సు. నాకప్పుడు బాల్య వివాహాల నిషేధం ఉండేదని అంతగా తెలీదు. ప్రియకీ తెలీదు.మరి దానికే తెలీందే నాకేం తెలుస్తుంది. ఉత్త పిచ్చి మొద్దుని. లేకపొతే ఆ పుణ్యవతీ టీచరు ఆట కట్టిద్దును."
అంటూ బాల్య వివాహం అనే పదాన్ని చక్కగా ఉపయోగించింది.

(http://priyamainamaatalu.blogspot.com/2008/08/blog-post_16.html)

తనే తరువాత రాసిన "సుందోప సుందులు" బాగానే రాసినా నాకెందుకో అది అంతగా పండలేదేమో అని అనిపించింది. అక్క ఇంకొంచం బాగా రాయగలదు.

ఇవే కాక ఇంకో టపా ఉంది. "వెంట్రుక పై శర్మా మాస్టరు" అంటూ గీతాచార్య గారు రాసింది. అదీ అంత అద్భుతంగా రాక పోయినా అల్లరి మాత్రం అదిరింది. వృత్త పరిధిని వెంట్రుక వాసిలో కనుక్కోవటంతో ఆయనకొచ్చిన 'పొగరుబోతు' అనే బిరుదుని గురించి బాగా రాశారు.

"బడి దేముందీ! అది అక్కడే ఉంటుంది గా. అందుకే అంత ఆలోచించక్కరలేదు."

"శర్మా మాస్టరు ఇరవై కి తగ్గితే నా తొడకి చిల్లి పెడుతాడు."

"పన్ను ఊడిన టామ్ సాయెర్ లాగా భలే పాపులర్ అయ్యాను."

మొదలైన మాటలు తమాషాగా ఉన్నాయి. ఇందులోది కొంచం డిఫెరెంట్ అల్లరి.

(http://annisangathulu.blogspot.com/2008/08/blog-post.html)


"చదువు వచ్చి మన మీద పడినా మనం వెళ్ళి చదువు మీద పడినా మనకే నష్టం.
చదువు రాకపోవటం ఒక యోగం
చదువుకోనక్కర్లేకపోవటం ఒక భోగం
చదువుకోవాల్సిరావడం ఒక త్యాగం.

ఈ మాటలు ఎందులోవో చెప్పక్కర్లేదనుకుంటా!

"నా మాస్టర్ ప్లానులోని ఒక బుల్లి ఫ్లా వల్ల,సుధ పిన్ని నాకు చేసిన అన్యాయం వల్ల, స్కూలో జైలులా, చదువో కష్టాల చెరువులా ఎంత అనిపించినా మా అమ్మ వీర ఉతుకుడుని దృష్టిలో వుంచుకుని అప్పట్నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బుద్దిగా స్కూలుకెళ్ళాల్సి వచ్చింది పాపం నేను......"

అని పాపం బడికి వెళ్లాల్సిన అగత్యాన్ని తప్పించుకోలేకపోయిన 'శ్రీవిద్య' గారి బ్లాగు నా దృష్టిలో "ది బెస్టూ!"

అస్సలిదంతా ఎందుకమ్మాయ్! అంటారా? ఎందుకా అల్లరిని చేసేకన్నా అల్లరిని గుర్తు చేయటం పెద్ద అల్లరి. ఉన్కోసారి చదివి/గుర్తు చేసుకుని మీరూ నవ్వుకుంటారనీ , నా రాత కోతల్లో సీరియస్సు నేస్సు కొంచం ఈ మధ్య ఎక్కువైందనీ... హేమంటార్?

మీకో పరీక్ష! 'Blog' అనే ఈ ఆంగ్ల పదానికి తెలుగు మాట చెప్పండి.

నా మనసంతా ఇప్పుడు "అల్లరల్లరై పోయింది". మరి ఉంటా! ఈ సారి అక్క పలకరిస్తుంది.

ప్రియ అయ్యంగార్.

Monday, September 15, 2008

ప్రేమంటె ఏమిటంటే...


నీ చెక్కిలి పై ముద్దిస్తాను... చిరునవ్వుల వరమిస్తావా?

చెప్పుచ్చుకుని కొడుతాను నీ ఏడుపుతో నాకు ఓ శాటిస్ఫాక్షన్ ఇస్తావా?

అసలు ప్రేమంటె? ఈ మధ్యన ఎందులోనో ప్రేమకి ఒక తమాషా నిర్వచనం చూశాను. ఆ కాంటెక్స్ట్ లో అది బాగానే ఉంది. జనరల్ గా ఆలోచిస్తే నాకు ఒళ్ళు మండింది. మళ్ళీ ఇంకోలా ఆలోచిస్తే అదీ నిజమే అనిపించింది.

ఇంతకీ ఆ నిర్వచనమేంటంటే... అసలు ప్రేమంటే ఏమిటి? అది రెండు క్రోమోసోముల మధ్య ఆకర్షణా?

తమాషా ప్రశ్న కదూ! అంతేనా? నాకు పూర్తిగా అర్ధం కాక ఒక ఫ్రెండ్ ని అడిగాను. దానికి తను ఇచ్చిన సమాధానం... "ఆ రాసినోడేవడో ఒక క్రాక్." అలాగా అనుకున్నాను. తర్వాతా ఒక డాక్టర్ అంకుల్ ని కలిశాను. ఆయనని ఇదే ప్రశ్న వేశాను. (ఆయనకీ నలభై ఏళ్ళు ఉంటాయి. అంకుల్ అనక తప్పదు. మళ్ళీ ఆంటీ అంకుల్ అంటూ నన్ను బాదొద్దు.) :=)

ఆయన కొంసేపు ఆలోచించి చెప్పిన సమాధానం... "ఆ రాసిన ఆయనెవరో జీవితాన్ని కాచి వడబోసినాయనై ఉంటాడు."
నాయనా! నాకు వడ అనగానే మన హైదరాబాదీ స్టైల్ డొక్కు వడ గుర్తుకు వచ్చి వాంతి అయినంత పని అయింది. "మాస్టారూ! నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన గురించి నాకెందుకు?" అన్నా. అప్పుడు అంకుల్ దారిలోకి వచ్చి చెప్పిన సమాధానం... "అసలు ప్రేమంటే ఏ ప్రేమ అయినా కావొచ్చు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి చెప్పింది ఒక రకమైన సూడో మెంటాలిటీ కల వారిని విమర్శిస్తూ చెప్పి ఉంటారు. అంటే చూడు! మగ వారిలో X-Chromosome, Y-Chromosome ఉంటాయి. అదే ఆడవాళ్ళలో రెండూ X-Chromosome లే ఉంటాయి. ఆ Y-Chromosome, ఈ X-Chromosome ఆకర్షణ లో పడటమే ప్రేమంటే! అని కాబోలు ఆయన ఉద్దేశ్యం."

"అంటే దానికర్థం?"

"అంటే మగ వారి ప్రేమలో కేవలం ఆకర్షణే ఉంటుందని కాబోలు."

"ఆన్ ది కాంట్రరీ, నేను చదివిన సందర్భం అది కాదు. అక్కడ మగ, ఆడ సంబంధం లేదు. సంతింగ్ ఏదో వేరే ఉద్దేశ్యం ఉంది అని నా అభిప్రాయం."

"ప్రాయం లో ఉండే వారి అభిప్రాయాలు అలాగే ఉంటాయి." మా నాన్నగారి మాటలనే అన్నారీయన. ఈయన మా నాన్నకి స్నేహితుడు. అందుకే ఈ విషయం తెచుకునే దాకా ఈయన్ని నేను వదిలేదు లేదు అని డిసైడ్ అయ్యాను.

"డయలాగ్ సూపర్. విషయమ్లోకి వద్దామా?"

"ఈ మధ్య ఇండియాకి వెళ్ళావా?"

"ఆ వెళ్లాను."

"అక్కడ కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించేవి జరిగాయి. అవేంటంటే... ప్రేమించలేదని అమ్మాయిలని కొందరు కుర్రాళ్ళు చంపెశారట!"

"విన్నాను నేను."

"విజయవాడ లో 'శారదా కాలేజి' లో ఒక అమ్మాయిని దారుణం గా నరికి చంపాడుట ఒకడు."

"శ్రీలక్ష్మి ఆ అమ్మాయి పేరు."

"అబ్బో! నీకు తేలుసే!"

"అప్పటికి నేను భారతదేశం లోనే ఉన్నాను."

"అలాంటి వారు చెప్పేది ఒకటే. అమ్మాయిని నేను ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించి తీరాలి. అలాంటి ప్రేమ పిచ్చి గురించి విమర్శగా అని ఉంటారాయన."

***********************************************************************************

ఆ రోజు నేను ఆయనతో ఈ విషయాలనే చాలా సేపు మాట్లాడాను. ప్రేమంటే ఇంతేనా అనిపించింది. నేను ఇంటికి వచ్చే దారిలో ఒక చిన్న పిల్ల హఠాత్తుగా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది. ఎందుకా అని నేను చూశాను. అక్కడ ఒక పావురం ఎగరలేక పడి ఉంది. ఆ పిల్ల వెళ్లి దానిని చేతుల్లోకి తీసుకుంది. ట్రాఫిక్ ని లెక్క చేయకుండా! ఎన్నో వెహికిల్స్ ఆగాయి అక్కడ. నేనూ పరిగెత్తుకుని వెళ్లి ఆ పిల్ల ని కలిశాను.

ప్రియ: "why did you risk your life?"

ఆ పిల్ల పేరు Stefanie Larson ట.

Stefanie: "This is a little pigeon. It is unable to fly. Also it can not hint at the traffic to stop. But I can. On seeing my hand signal, the man in the car did what he should do."

ప్రియ: "Nice. Do you love pigeons?"

Stefanie: "No. But I love everything created by the Lord. This is a helpless little creature. I have seen it. So I want to help it. You know, If uou love everything as you, You can have no enemy in the world.


"అసలు ప్రేమంటే ఏమిటి? అది రెండు క్రోమోసోముల మధ్య ఆకర్షణా?" ఇది ఉంది
http://point-blank-questions.blogspot.com/2008/07/blog-post.html అనే లింక్ లో. ఆ బ్లాగ్ నన్ను ఎందుకో కొంత ఆలోచింప చేసింది. ఈ ప్రశ్నని ఆలోచించాల్సిందే.

ప్రియ అయ్యంగార్.

Saturday, September 13, 2008

ఎంతందంగా ఉంటుందో...



పొద్దున్నే లేచి హాయిగా అలా అలా నడుస్తూ నాతో నేను మాతాడుకుంటూ ప్రకృతిని చూసి పులకించి పోతే...! ఓహ్! ఆ ఆనందమే వేరు. ఒక సారి నేను వైజాగ్ లో ఉన్నప్పుడు పొద్దున్నే లేచి మా ఇంటి చుట్టూ ఉన్నా రోడ్డులలో తిరిగొచ్చాను. అది చలి కాలం. తెల్లవారుఝామున పూట అలా అలా తిరుగుతుంటే ఎంత బాగుంటుందో కదా! అంతకుముందు రోజు నాకు ఎందుకో చికాకుగా ఉంది. ఈ దెబ్బతో ఆ చికాకు అంతా పోయింది.
ఒక సారి నాకు జ్వరం వచ్చి ఇంట్లోనే ఉన్నాను. వైష్ణవి బడికి వెళ్ళింది. నాకేమో ఏమీ తోచటంలేదు. ఇంట్లో అమ్మ బ్యాంకు కి వెళ్ళింది. నాతో పాటే ఇంట్లో ఉంది నాయనమ్మే. తనేమో పూజలలో తలమునకలై ఉంది. పడుకుని పడుకుని నాకు మహా విసుగేసి కొంసేపు వరండా లోకి వెళ్లాను. తలంతా దిమ్ము గా ఉంది. నేను గ్రిల్ల్స్ వైపు నిరాసక్తంగా చూస్తుండగా ఒక పిచ్చుక వచ్చింది. అది ఎంత ముద్దుగా ఉందో. అది నెల మీద వాలి అక్కడ నాయనమ్మ ఏరి పడేసిన బియ్యం గింజలనీ, పురుగులనీ తింటోంది.
నాకు చాలా ముచ్చటేసింది. కొంసేపు దాన్ని అలా చూస్తూ గడిపేసరికి జ్వరం వల్ల వచ్చిన చిరాకు అంతా పోయింది. అదెక్కడ ఎగిరి పోతుందో అని నేను లోపలకి వెళ్లి కొన్ని గింజలని తీసుకు వచ్చి కొంచం దూరంగా వేశాను. అది తింటుందేమో అని. అది నెమ్మది నెమ్మది గా తన ముందు ఉన్నా వాటిని తిని, కాసేపు నా వైపలా అనుమానంగా చూసింది. నేనేదేమన్నా ట్రాప్ చేస్తానేమో అని. నేనూ దాని వైపలా అమాయకం గా రెప్ప వాల్చకుండా చూస్తూనే ఉన్నాను. అది ఏమనుకుందో ఏమో నన్నొదిలేసి, నేను వేసిన గింజలని తినటం మొదలెట్టింది.
నాకిదంతా సరదాగా అనిపించింది. దాని బుజ్జి బుర్రలో ఎన్ని ఆలోచనలో కదా! నేనేదేమయినా చేస్తానేమో అని ఎంత జాగ్రత్త. నా వల్ల ప్రమాదం లేదని నిర్ణయించుకునే దాకా అది నేను వేసిన గింజలని అది ముట్టు కోలేదు.
లండన్ లో కూడా పావురాలకి నేను కొన్ని సార్లు గింజలని వేశాను.
అలాగే ఏదయినా పిల్ల కాలువలో చేప పిల్లలని చూస్తున్నా సమయం తెలీకుండా గడిచి పోతుంది. అస్సలు దేవుడి సృష్టి అంతా ఎంత ఎండంగా ఉంటుందో కదా...
మనసుకి ఏదయినా కష్టం కలిగితే ఒక చీమ పాకే దారినీ అది తన గతిని చీటికీ మాటికీ మార్చుకుంటాం చూస్తె మన మొహాన చిరునవ్వొకటి వెలుస్తుంది. అది చాలు ఎంతటి విసుగైనా తగ్గటానికి.
ఒక విషయం చెప్పనా చీటికీ మాటికీ తన మార్గాన్ని మార్చుకుంటుంది కనుకే దానిని చీమ అంటారు.
ఎలా ఉంది నా డెఫినిషన్? :-)
ఇప్పుడు ఆ పిచ్చుకలూ పావురాళ్ళు ఏమయి పోయాయి. నా చిన్ని నేస్తం పిచ్చుక కోసం మొన్నీ మధ్య భారతదేశానికి వచ్చినప్పుడు ఎంత వెతికినా కనపడలేదు. మీకేమయినా కనిపిస్తే నాకు చెపుతారా?

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez