Thursday, June 19, 2008
మైలు దూరం
అందుకే నేను ఎక్కువగా నవ్వుతుంటాను. అసలు చిరునవ్వుచూస్తే శత్రువైనా కరిగిపోడా. పాపాయిలా బోసి నవ్వులు ఎంత అందంగా ఉంటాయి. అసలు నవ్వే మనిషికి ఆభరణం. చిరునవ్వుతో ఉండే మనిషి ఎంత అందంగా ఉంటాడు! ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన ఆఫ్రికన్ అథ్లెట్ లను చూడండి. ఆ విజయానందంలో ఎంత అందంగా కనిపిస్తారో!
మా నాన్న గారికి కపిల్దేవ్ అంటే ఇష్టం. తనని చూసి స్ఫూర్తి పొందానని అంటుంటారు. ఒకసారి నన్ను ఏదిపిద్దామని "నీ వల్లే కపిల్దేవ్ ఓడిపోయాడు" అని సీరియస్ గా అన్నారు. నేను నా ధోరణిలో "ఎప్పుడు?" అన్నాను. "నువ్వు పుట్టిన తరువాత ఎనిమిది నెలలకి, అందుకే నీతో మాట్లాడటం మానేస్తున్నాను," అన్నారు. "ఎంత దాకా?" అన్నా. "ఎయిట్ మంత్స్," అన్నారు. "అయితే నాకు ఒక కథ చెప్పు," అన్నా. "ఇంకా ఎయిట్ మంత్స్ కాలేదు," అన్నారు. "కపిల్దేవ్ ఓడిపోయి సెవెన్ ఇయర్స్ అయింది. పోదాం పద," అన్నాన్నేను. దాంతో ఆయన పగలబడి నవ్వుతూనే ఉన్నారు అమ్మ వచ్చి విసుక్కున్న దాకా.
పొద్దున్న టీవీలో కపిల్ పోస్టర్ని పీసీయే స్టేడియంలో తొలగించిన న్యూస్ చూస్తుంటే నాకు నాన్న గారే గుర్తుకు వచ్చారు. అనుకోకుండా కళ్లు మసకగా అనిపించి చేత్తో తుడుచుకున్నాను. నేను ఎదుస్తున్నానని నాకు అప్పుడర్ధమయింది. వైష్ణవి చూస్తే ఎక్కిరిస్తుందేమో అని తల విదిలించి ఒకసారి నవ్వాను. ఒకసారి నవ్వాను. అంతే! దిగులంతా పోయింది.
అసలు కపిల్దేవ్ గ్లామర్ అంతా తన 1000 వాట్స్ నవ్వులోనే ఉంది. లేకపోతే అలాంటి మొహం ఉన్న సామాన్యుడు వీధిలో ఉంటే ఎవరైనా చూస్తారా!
అదే అంత నవ్వు ఉంటే ఆ కళే వేరు. అసలు నవ్వంటే గెలుపువల్ల కలిగిన నవ్వు. మన శక్తిని నూరు శాతం ఉపయోగించి ఒక విజయం సాధిస్తే కలిగే ఆనందమే వేరు. కపిల్ నవ్వులో ఆ కళే ఉంది.
మీకో జోక్ చెప్పనా నాన్నారు పోయి ఎనిమిది నెలలే అయింది. హ హ హ. భలే కోయిన్సిడెంట్ కదూ.
దేవుడు నాకు కనిపిస్తే నేను కోరుకునేది "స్వామీ! జీవితంలో ఎప్పుడూ నా మొహంలో చిరునవ్వు పోకుండా చూడు చాలు." అంటా. చెప్పొద్దూ! అసలు మనం నవ్వుతూ ఎ పనిచేసినా అది ఎప్పుడూ విజయమే. కదూ.
తెలుగు బ్లాగర్లకి "వయ్యంటే బిడ్డే" ఉన్న లింక్ annisangathulu.blogspot.com నిన్న నేను రాసిన బ్లాగు లో మెన్షన్ చెయ్యటం మరిచిపోయాను.
అసలు ప్రపంచంలోని అతి పెద్ద పదమే స్మైల్. మరి దాన్ని గౌరవించ వద్దూ. అందకనే మనందరం నవ్వుతూనే ఉందాం.
టా టా!
Wednesday, June 18, 2008
నేనొక బ్లాగుని చూశాను.
సెలవల్లో ఇండియాకి (క్షమించాలి భారతదేశం) వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వైష్ణవి బ్లాగులు రాయటం చూసాను. అంతకు ముందు సెల్వి (లండన్ లో ఫ్రెండ్) నన్ను కూడా బ్లాగులు రాయమంది. అదో సుత్తి అని నేను మొదలెట్టలేదు.
ఒకరోజు వైష్ణవి బ్లాగు రాస్తుంటే బోరుగా ఉన్నా నేను కూర్చున్నాను. ఇంతలో తను తెలుగులో కూడా బ్లాగు రాయవచ్చు అని చెప్పింది. అది వినగానే నాకు ఇంట్రెస్ట్ పుట్టుకు వచ్చింది. దాంతో నేను ఒక ఎకౌంటు తయారు చేసుకున్నాను. రాద్దామనుకునేంతలో కరెంటు పోయింది. మంచి శకునం మించిన దొరకదు అని నేను బ్లాగు రాయటానికి డిసైడ్ అయ్యాను. అయితే అప్పుడు బయటకు వెళ్ళవలసిన పని ఉండటంతో నాకు ఆరోజు కుదరలేదు.
మొత్తానికీ నేను కూడా బ్లాగు రాసాను. కూడలిలో పెట్టాను. అయితే రాసేముందు కొన్ని బ్లాగులని చదివితే బాగుంటుంది అని నేను అడిగితే వైష్ణవి కొన్ని బ్లాగులని చూపించింది. అవి కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. చదివిన వాటిల్లో చాలావరకూ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా జ్యోతి గారివి, క్రాంతి గారివి. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లుగా నేను చాలా సేపు బ్లాగులని చూసాను. వైష్ణవి ఆంగ్లంలో రాస్తుంది. ఎన్నెన్నో బ్లాగులు. అందులో కొన్ని మరీ కొత్తవి కొన్ని మరీ పాతవి. అన్నీ వేటికవే బాగున్నాయి.
కొన్ని సంఘటనలు హఠాత్తుగా జరుగుతాయి అంటారు. ఇంక సిస్టం షట్ డౌన్ చేద్దాము అనుకుంటుంటే ఒక బ్లాగు కనిపించింది. సత్యమేవ జయతే అని హెడ్డింగు ఉంటే ఏదో బోరు బాపతే అనుకుని క్లోజ్ చెయ్య బోయాను. అంతలో నాకు ఒక ఫోటో కనిపించింది. అది కృష్ణస్వామి అల్లాడి ది. ఆయన ఎవరంటే Matscience vyavasthaapakulaina వ్యవస్థాపకులైన అల్లాడి రామ కృష్ణన్ గారి అబ్బాయి. వారు మా నాన్నగారికి గురువుగారట. అల్లాడి కృష్ణస్వామి University of Florida లో Professor and Chair, Department of Mathematics. ఆయన గురించి నాకు కొద్దిగా తెలుసు. ఆయన గురించి రాసారేమో అనో ఆ బ్లాగు చదివాను.
దాని కింద ఉన్నా శీర్షిక నన్ను ఆకర్షింది. అది "వయ్యంటే బిడ్డే." దాని కింద "అమ్మ" అని ఇంకో శీర్షిక. అమ్మ బాగుంది. అంతే. బాగుంది. చాలా బాగుంది అని మాత్రం చెప్పను. కానీ చదవాల్సిన అంశమే ఉంది అందులో. కానీ నన్ను పడగొట్టింది మాత్రం వయ్యంటే బిడ్డే. ప్రారంభం నుంచీ ముగింపు దాకా ఎక్కడా ఆగకుండా నేను చదివాను. అద్భుతం అనిపించింది.
ఆడ పిల్లలు పుడితే అత్తగారు, మొగుడు పెట్టె హింసలగురించి. కేవలం అదే అయితే నేను ఈ బ్లాగుని రాయనవసరం లేదు. అసలు రాసేదాన్ని కాదు.
ఎంతో పెద్ద సమస్యని చాలా చిన్న కథలో హాస్యస్ఫోరకంగా చాలా చక్కగా చెప్పారు. కథలోని ప్రతి వాక్యం కూడా ఎంతో ఇంటిగ్రేట్ అయి ఉన్నది. ప్రారంభం నుంచీ ముగింపు దాకా కథలో ఇంటిగ్రిటి ఉంది. ఒక రొమాంటిక్ కామెడీని రాసినట్లుగా రాశారు. కానీ అసలు సమస్యని మరుగున పడవెయ్యలేదు. అసలు పాయింట్ని చెంప చెళ్ మనిపించేలాగా చాలా సూటిగా చెప్పారు. ఎక్కడయితే చెప్పాలో అక్కడే ఆ పాయింట్ని చెప్పారు. కేవలం ఒకే వాక్యం కథ మొత్తానికీ ప్రాణం. అది చాలా బాగా పడింది.
మొదట్లో నారేటర్ భర్త నవ్వటం, చివరలో అత్తగారు నవ్వటం what a beautiful link?
ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ అది. అందుకే అది అందరూ చదవాలని ఈ బ్లాగు రాస్తున్నాను.
గీతాచార్య గారికి అభినందనలు.
ఇక నా మాటలు. ఈసురోమంటూ ఉన్దేతట్లయితే ఈ జీవితం ఎందుకు. జీవితం నందనవనం లాంటిది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి క్షణం మనకోసమే అన్నట్లు ఉండాలి. ఆ బ్లాగరి కూడా అందువల్లే కథను ఇలా రాసుంటారు. అంత సీరియస్ పాయింట్ని తీసుకుని చాలా చక్కని హాస్యం తో రాసినందువల్లె నాకు ఆ కథ నచ్చింది.
మా ఇంట్లో అందరూ దీన్ని చదివారు. నా అభిప్రాయంతో ఏకీభవించారు.
Tuesday, June 17, 2008
సంతోషం
జీవితం అంటే అదొక ఆట. ఆటలంటే పిల్లల దగ్గరనుంచీ పెద్దల వరకూ అందరికీ ఇష్టం. మరి జీవితం అంటే ఎంత ఇష్టం ఉండాలి? సంతోషంగా జీవించటమే జీవిత పరమార్ధం. లేకపోతే జీవితం వృధా.
ప్రతి క్షణాన్నీ ఆనందంగా గడపటం నాకు ఇష్టం. ఈసురో మంటూ ఎందుకు బ్రతకాలి? ఎంత కష్టం అయినా బాధపడితే పోదు. నవ్వుతూ ఆలోచిస్తే ఎంతటి కష్టం అయినా తేలిక పడుతుంది. అందుకే నవ్వుతూ బ్రతకండి.
సూపర్ స్టార్ కృష్ణ పాట విన లేదా? నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ....










