Friday, December 19, 2008

టాప్ టెన్ తెలుగు టపాలు.


మొన్నీ మధ్యన నాకు ఒక ఐడియా వచ్చింది. మన తెలుగు బ్లాగ్స్ చాలా ఉన్నాయికదా! (రాసిలోనూ, వాసిలోనూ, ఇతర దక్షిణ భారతదేశ భాషలకన్నా ఎక్కువే). మనకి గర్వం. mmm. కదూ!


అందులో టాప్ టెన్ టపాలని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి ఆ విషయాన్ని అక్కకి చెప్పాను. అక్కేమో వాటిని మనమే సెలెక్ట్ చేసే బదులు మనకి తెలిసిన వాళ్ళకీ చూపించి వాళ్ళనే చేయమంటే బావుంటుందేమో అంది. "ఇదేమైనా జెమిని దసరా అవార్డులా అందరినీ చేయమనేందుకు?" అన్నాను నేను. "అందరూ అంటే అందరూ కాదే మొద్దు మొహం (ఈ మధ్య వర్క్ ఎక్కువై నిద్ర తగ్గి మొహం ఉబ్బినట్లు ఐందిలే.) అందరికీ బ్లాగ్ లంటే తెలియ వద్దూ. అందుకే మన మన అమ్మలకీ, మా నాన్నకీ, పెరుమాళ్ గాడికీ (తమ్ముడు . శ్రీనివాస పెరుమాళ్ వాడి పేరు) చూపించి చదివి సెలెక్ట్ చేయమందాం.," అంది.


"ఐడియా బానే ఉంది కానీ ఎవరు చదివేరు?"


"అందరూ ఈ మధ్యన చూస్తున్నారు."


సరే కానీయమని తనకి ఆ పనిని అప్పజెప్పాను. అలా మొత్తం ఆరుగురు కలసి ఎంపిక చేసిన టపాలే నా బ్లాగ్ లో పెట్టిన టాప్ టెన్ టపాలు. వాటి గురించి ఇయరెండ్ సందర్భంగా ఓ పరిచయం. తీసుకున్నవన్నీ చాలా వరకూ ఈ సంవత్సరం ప్రారంభించిన బ్లాగ్స్ నుంచే. ఇక చూద్దామా?

****************************************************************



అన్నిటికన్నా పైన ఉన్నది నాకు బాగా నచ్చిన టపా. ఎవరూ సెలెక్ట్ చేయరేమో అనుకున్నా. నా టేస్ట్ అలాంటిది. దానికి తగ్గట్టుగానే ఎక్కువ కామెంట్స్ పడలా. దీని గురించి ఎక్కువేమీ చెప్పనవసరం లేదు. ఎందుకంటే నా మొదటి tఅపానే దీని గురించి. నా బ్లాగ్ లో చూడండి.




అసలు టపా అంటే ఇదీ. ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. సుజాత గారి ఆవేదన దేవుడు అర్ధం చేసుకున్నాడా అన్నట్టుగా ఆ తరువాత కొద్ది రోజులకే తెలుగుకి ప్రాచీన హోదా వచ్చింది. :-) తెలుగులో one of the prolific, and powerful writer. అందుకే అలా అలవోగ్గా కామెంట్స్ ని కొల్ల గొడుతున్నారు.




దీని గురించి చాలా చెప్పాలి. టెక్నిక్ అద్భుతం. అలా కేవలం సంభాషణతోనే ఎంతో భావాన్ని, డెప్త్ తో చెప్పటం, కథని నడిపించటం కష్టం. మనకీ అక్కడే ఉన్నా భావాన్ని కలిగించి, తాను చెప్పిన విషయాన్ని మనకూ అనుభూతింప చేయటం great. Inimitable style.




చెప్పాలా ఎవరు రాశారో? వద్దన్నా చదివి మళ్ళీ కామెంట్ రాస్తారు. చాలామంది. కత్తి లాంటి టపా. టపా కన్నా నాలుగైదు కామెంట్స్ బాగున్నాయి. అవే టపాకి అందం తీసుకోచాయి. టపా బాగుండటం కాదు. రాసిన విధానం, స్పందన రప్పించిన (క్షమించాలి. మహేష్ గారి టపాని చదివి స్పందించకుండా ఉండటం కష్టం అందుకే అలా అన్నాను. ఎవరి మనసునైనా నొప్పిస్తే సారీ).




అసలు ఎవరూ పట్టించుకోని మాస్టర్ పీస్ ఇది. రాస్తే ఈయనే రాయగలరు అనే ఆలోచనలు అందులో ఉన్నాయి. చదవకపోవటం మన దురదృష్టం. అంతే.


"దేవుడు అందరి దగ్గరా ఉండలేక అమ్మని సృష్టించాడంటారు. నాకు మళ్ళీ అర్ధం కాలేదు. అసలు దేవుడంటే సర్వ శక్తిమంతుడు అంటారు కదా? మరి ఆయన అందరి వద్దా ఉండలేడా? ఆ ఆలోచనే ఫూలిష్నెస్స్. మరి అమ్మ ఎందుకు? ఆలోచించాల్సిన ప్రశ్నే!" ఈ తరహా ఆలోచన, అమ్మ చేతి ముద్దా గొప్పతనాన్ని గురించి చెప్పిన తీరూ, చదవక పోతే అది మన bad luck. అంతే.


మావి తప్ప వేరే ఎ కామెంట్స్ లేక పోవటం ఆశ్చర్యమే మరి.**




"Decisions are to be made quick." చదివే వారిని ఉలిక్కి పడేలా చేసిన టపా అది. నిజంగా జరిగితే మాత్రం చాలా ఆనందదాయకమైన సంగతి అది. సృజన గారి శైలి ఎంత ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలిస్తున్నదంటే... చదివిన వాళ్లు ఫ్లాట్. చదివి ఆనందించండి అంతే. చెప్పటం కుదరదు. కష్టం. ఎందుకంటే టపాలోని ప్రతి వాక్యం చెప్ప దగినవే. వారి ఇష్ట సఖుడు సజెస్ట్ చేసిన స్టైల్ త అది. ఆయనా రాస్తారేమో? ఎవరైయ్యుంటారబ్బా! మన బ్లాగ్స్ లో అలా రాసేవాళ్ళు కనబడలా నాకు).




టైటిల్ చూడగానే గుర్తుకు వచ్చే పేరు ఆ బ్లాగ్ ది. కొందరికి చాలా ఇష్టమైన బ్లాగ్ అది. అక్క అది తప్ప వేరేవి చాలా తక్కువ చదవటం తెలుగు బ్లాగ్స్ లో. దానికి ఇంగ్లీష్ ఎక్కువ ఇష్టం.


'విజేతల స్వర్గ ధామం - వింబుల్డన్ విలేజ్'. అది థీం. తెలుగులో ఏకైక sports blog. We have no such blogs on sports exclusively. ఈ టపా చదివితే మనకీ ఆ రోజు మ్యాచ్ ని చూసిన అనుభూతి కలుగుతుంది. టైటిల్ లో పన్ బాగా పండింది.




తల్లీ బిడ్డల ఫోటో తో పాటూ చాలా అందమైన భావాలూ, అనుభూతులూ... చదివి ఆనందించాల్సిందే. ముద్దబంతి గారి టపాని చూడగానే ఎంతో ఆనందం కలిగింది. ఎందుకో రాయటం లేదిప్పుడు. A cool blog of beautiful emotions.




ఎందులోనో జ్యోతి గారి సమీక్ష చదివి అక్క లింక్ వెతికి పంపితే చదివాను నేను. మంచి టపా. ఆలోచింప చేసిన టపా. రమణి గారిది.




ఆ సీరీస్ అంతా చాలా discussion పెట్టించింది. ఎన్నో విషయాలు బైటకి, చర్చకీ వచ్చాయి. జర్నలిజం లోని అంతర్గత విషయాల్ని నిర్భయమ్గా రాయటం ఆ గుంటూరు మిరపకాయ (సారీ మా అమ్మ అన్నది చదివి) గారికే చెల్లు.


***************************************************************


ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి. కానీ వైవిధ్యం, వస్తువు, టెక్నిక్, లని ఆలోచించి తీసుకున్నవి ఇవి. మీవి రాందే నన్ను కొట్టొద్దే.

సుజ్జి గారు రాసిన ఈ నాలుగు లైన్లూ చూడండి.

నాది కాని లోకంలో
ఏ మనిషిని వెతకను..??
నీళ్ళు లేని సంద్రంలో
ఏ నావను నడపను..!!??

అలాగే పూర్ణిమ గారు రాసిన అల్లరిటపా.... మనసునలా ట్విస్ట్ చేశాయి.


5 వ్యాఖ్యలు:

Purnima on December 19, 2008 9:38 AM said...

Cool Priya.. this is a very nice gesture.

Know what? The bloggers meet on last weekend had this point of introducing / writing about the posts or blogs we like, which allows newcomers to know some real good ones. And I heartily appreciate that you've taken that step. (Wish my posts weren't part of it, which would have allowed this to sound genuine ;-))

Good job! And thanks for chosing my post.

Looking forward for more posts from you.

Best Regards,
Purnima

చింతా రామకృష్ణారావు. on December 19, 2008 10:04 AM said...

ప్రియా!
కందము:-
ప్రియమగు నిర్ణయమమ్మా!
ప్రియ మొదవెడి బ్లాగులు పది తృప్తిగ చూపన్
జయ భావనతోడ తమస
మయమును వెచ్చించి వ్రాయు మహనీయముగన్.

ఆంధ్రామృతాన్ని గ్రోలి చూడు. ఆంధ్రత్వ మాంధ్ర భాషాచ పూర్వ జన్మ తపః ఫలం. అన్నదర్థమౌతుంది.
శుభమస్తు.

మోహన on December 19, 2008 11:07 PM said...

Nice job!

రాధిక on December 20, 2008 8:55 PM said...

good job.

Dhanaraj Manmadha on December 29, 2008 8:37 PM said...

Thewinners are really worth appreciated. You get it right Priya garu.

You got Wimbledon Village. But missed Kalhaara.

Any way thanks for introducing the unknown master-piece, about Amma.

అలా వెళ్ళొచ్చేవి...

  • MOTORCYCLE DIARIES: The Fatal Night - 1 - Dhanaraj Manmadha Says... August 24, 2009, Hyderabad. టైమ్ పదిన్నర కావస్తోంది. "రేయ్ ధనా! మాస్టర్జీ ఫోన్. అర్జంట్. లేవాలి," అమ్మ పిలుస్తుంటే కలత నిద్రలోంచ...
    15 hours ago
  • సెలవురోజులొచ్చాసాయే బ్లాగు! - మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. ఈ వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక ...
    1 day ago
  • వోట్లు- చెప్పరాని పాట్లు! - "చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?" "మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు" "అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి" "అవకాశం మీది....
    1 day ago
  • గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు - ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి *"గొడ్డుమాంసం - ఒక సంస్కృతి"* అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధ...
    2 days ago
  • బండీ రా.. పొగబండీ రా.. - శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే ...
    3 days ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez