Sunday, November 30, 2008

అక్కకి పెళ్లి కుదిరిందోచ్!


నాకు శుభవార్త అయినా అక్క మాత్రం బ్యార్ మంది. ఫోనులో విషయం చెబ్తూ. ఇంతకీ విషయం ఏంటే అన్నాను. అప్పుడు మొదలైంది దాని సోది. చావ కొట్టి చెవులు మూసిందంటే నమ్మొద్దు. ;-)


ఈ మధ్య నేను వర్క్ లో బాగా బిజీ గా ఉన్నాను. దానితో మా మధ్య కమ్యూనికేషన్ తగ్గింది. అసలు ఈ మధ్య వేరే ప్పనేదీ చేయటానికి సమయం చాలటంలేదు. కానీ మొన్న అంటే నిజంగానే మొన్న నాకు కొంచం తీరుబడి చిక్కింది. హాయిగా చలిగా ఉంటే ఒక రగ్గు కప్పుకుని వేడి వేడి కాఫీ తాగుతూ, Serendipity సినిమా చూస్తూ కూచున్నాను. ఇంతలో నాకు ఫోను. ఉంది చాలాసేపు లిఫ్ట్ చేయలా. మొగీ మొగీ నాకు విసుగొచ్చి తీశాను.


"కొంపలంటుకున్నాయే హరీ! దేవుడు లేడు. ఉంటే నాకింత అన్న్యాయం చేయడు."

"ఏమైన్దక్కా?"

"ఇంకేం కావాలే! నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు."

"అందులో కొంపలంటుకోవటానికి ఏమున్నది? శుభవార్త చెప్పావు."

"ఏముందా? అసలు నీకేమి తెలుస్తుందే. పని పిచ్చి ఎక్కువున్న దానివి. పెళ్ళంటే సామాన్యమా? ఎన్ని బాధ్యతలు మన ముందుకు వస్తాయి? దాని సంగతి సరే! ప్రతీ దానికీ మొగుడు చెప్పినట్టు వినాలి........"

దాని వాక్ప్రవాహానికి అడ్డు తగిలి, "వినాలంటే అందరూ అలాగే ఉండరుగా?"

"అందరూ నాకు తెలీదు. మళ్ళీ అత్తగారి మాటలూ వినాలి."

"అబ్బ! నీ సోదేంటే? అత్తగారి మాటా వినొద్దు. మొగుడి మాటా వినొద్దు. Mutual understanding ఉండాలి కానీ ఈ పిచ్చి సంగతులు ఏమిటి? నచ్చితే చేసుకో. లేకపోతేపెద్ద నాన్న తో విషయం మాట్లాడు."


"నచ్చటం, నచ్చకపోవటం కాదే! పెళ్ళైతే నేను వంట చేయాల్సి వస్తుంది."

అద్దీ అస్సలు సంగతి. మొత్తానికీ బయట పెట్టింది. దానికి వంట చేయాలంటే భయం. బద్ధకం. ఎందుకంటే ఒకసారి చిన్నప్పుడు ఏదో చేయాలని ఏదో చేసి చెయ్యి కాల్చుకుంది. అది కాదు. పెద్ద మంట పెట్టి పిచ్చి ప్రయోగం చేస్తే వాళ్ల అమ్మ మీద నూనె పది కాళింది. దాంతో పెద్దమ్మ వీపు మీద ఒక వేడి వేడి దోశ వేసింది. అంతేనా? మా పెద్ద నాన్న చట్నీ చేసి పెట్టాడు. దెబ్బతో అది వంటంటే కడివెడు సాంబారు కార్చేస్తుంది. అదన్న మాట సంగతి.

అందుకే ఈ మధ్య అక్క "వంట వచ్చిన వాడే మొగుడు" అనే నినాదాన్ని ఎత్తుకుందట. పెద్దమ్మ చెప్పింది.

చాలా రోజులైంది కదా! అందరికీ ఒక హలో!

ప్రియ అయ్యంగార్.




5 వ్యాఖ్యలు:

sujji on November 30, 2008 10:05 AM said...

intaki pelli aeppudo, aekkado chepparu kaadu..!!

సుజాత on November 30, 2008 11:16 PM said...

పెళ్ళికూతురికి, మరియు తోడు పెళ్ళి కూతురికి శుభాకాంక్షలు!

రాధిక on January 12, 2009 6:44 PM said...

oho adaa sangati :)

J-O-S-H (My Bench !) on January 22, 2009 3:26 PM said...

My god!! i was rolling on the floor for the phrases u used. SO good to hear such telugu after a long time.
Chala sarada vesindi chaduvutunte. Anni posts teerikaga chadivi comments raastanu. First time here.
Nice blog.
Congrats to ur sister.
I welcome her to the club!

J-O-S-H (My Bench !) on January 22, 2009 3:28 PM said...

I see that Radhika garu also follows this blog. Nice one here.Inta manchi blog undani makenduku cheppaledu. Memu chadivi anandinche vallam kada radhika garu.

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez