ఈ మధ్య కాలేజీ పనులతో బాగా బిజీగా ఉన్నాను. అక్కేమో ఇంటర్నల్స్ లో మార్కులు ఎక్కువ రావటంతో షాక్ తిని మంచం ఎక్కింది. (నిజంగానే ఎక్కువ వచ్చాయి. ఒట్టు.). దాంతో బ్లాగ్ అంత వేగంగా నడవటం లేదు. నాకూ ఎక్కువ టైం లేకపోవటంతో రాయటానికి ఒక్క టాపిక్కూ దొరకటం లేదు. ఏమి చేద్దామా అని బ్లాగుల మీద పడ్డాను. చాలా కాలం నుంచీ ఏవో ఒకటి రెండు స్టాకు బ్లాగులు తప్ప మిగతా వాటిని చదవటం లేదు నేను. దాంతో చాలా సార్లు నేను బ్యాఖ్యలు చేయటం కూడా జరగలేదు.
అందుకే కొంచం బిజీ తగ్గేదాకా టపాకట్టేద్దాం అనుకుంటూనే ఇప్పుడే ఇలా వచ్చాను. నెల రోజులు నేను Cambridge కి వెళుతున్నాను. అందుకే మీకు ఇలా ఒక హాయ్ చెప్పి పోదామని వచ్చాను. విషయం లేకుండానే ముగిద్దాం అనుకుంటుంటే ఒక కొత్త బ్లాగ్ చూశాను. దాని పేరు 'ధూమ్ ధాం'. తమాషాగా ఉంది కదూ. నాకూ అలాగే అనిపించి చదివాను. 'నాన్న తెచ్చిన పెళ్లి సంబంధం' అంటూ Srujana గారు బాగా రాశారు. నేరేషన్ నుంచీ విషయం వరకూ అంతా Fresh. ఎక్కువ decoration లు లేకుండానే ముచ్చట గా రాశారు. అందుకే ఒక మంచి టపా గురించి చెప్పి వీడ్కోలు గిఫ్ట్ ఇద్దామని అలింక్ ఇస్తున్నాను.
http://aatanemaatakardham.blogspot.com/2008/10/blog-post.html
కాకపోతే టపా సొగం నుంచీ కొద్దిగా పట్టు తప్పినట్లు నాకనిపించింది. అయినా బాగుంది. ఆ క్రింది టపా కూడా బాగుంది. చదివిన తర్వాత ఇన్నాళ్ళూ మిస్ అయ్యానేమో అని పించింది.
ఈ మధ్య అక్క ఒక బ్లాగర్ ని కలిసి బుర్ర తినేసింది. ఆ విషయాలని తనే రాస్తానంది.
Good bye Bharath.
వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. నేను రేపే వెళ్ళిపోతున్నాను. వచ్చి పది రోజులైంది.
టాటా.
ప్రియ అయ్యంగార్.
వోట్లు- చెప్పరాని పాట్లు!
-
"చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?"
"మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు"
"అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి"
"అవకాశం మీది....
9 hours ago











0 వ్యాఖ్యలు:
Post a Comment