Monday, September 15, 2008

ప్రేమంటె ఏమిటంటే...


నీ చెక్కిలి పై ముద్దిస్తాను... చిరునవ్వుల వరమిస్తావా?

చెప్పుచ్చుకుని కొడుతాను నీ ఏడుపుతో నాకు ఓ శాటిస్ఫాక్షన్ ఇస్తావా?

అసలు ప్రేమంటె? ఈ మధ్యన ఎందులోనో ప్రేమకి ఒక తమాషా నిర్వచనం చూశాను. ఆ కాంటెక్స్ట్ లో అది బాగానే ఉంది. జనరల్ గా ఆలోచిస్తే నాకు ఒళ్ళు మండింది. మళ్ళీ ఇంకోలా ఆలోచిస్తే అదీ నిజమే అనిపించింది.

ఇంతకీ ఆ నిర్వచనమేంటంటే... అసలు ప్రేమంటే ఏమిటి? అది రెండు క్రోమోసోముల మధ్య ఆకర్షణా?

తమాషా ప్రశ్న కదూ! అంతేనా? నాకు పూర్తిగా అర్ధం కాక ఒక ఫ్రెండ్ ని అడిగాను. దానికి తను ఇచ్చిన సమాధానం... "ఆ రాసినోడేవడో ఒక క్రాక్." అలాగా అనుకున్నాను. తర్వాతా ఒక డాక్టర్ అంకుల్ ని కలిశాను. ఆయనని ఇదే ప్రశ్న వేశాను. (ఆయనకీ నలభై ఏళ్ళు ఉంటాయి. అంకుల్ అనక తప్పదు. మళ్ళీ ఆంటీ అంకుల్ అంటూ నన్ను బాదొద్దు.) :=)

ఆయన కొంసేపు ఆలోచించి చెప్పిన సమాధానం... "ఆ రాసిన ఆయనెవరో జీవితాన్ని కాచి వడబోసినాయనై ఉంటాడు."
నాయనా! నాకు వడ అనగానే మన హైదరాబాదీ స్టైల్ డొక్కు వడ గుర్తుకు వచ్చి వాంతి అయినంత పని అయింది. "మాస్టారూ! నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఆయన గురించి నాకెందుకు?" అన్నా. అప్పుడు అంకుల్ దారిలోకి వచ్చి చెప్పిన సమాధానం... "అసలు ప్రేమంటే ఏ ప్రేమ అయినా కావొచ్చు. కానీ ఇక్కడ ఆ వ్యక్తి చెప్పింది ఒక రకమైన సూడో మెంటాలిటీ కల వారిని విమర్శిస్తూ చెప్పి ఉంటారు. అంటే చూడు! మగ వారిలో X-Chromosome, Y-Chromosome ఉంటాయి. అదే ఆడవాళ్ళలో రెండూ X-Chromosome లే ఉంటాయి. ఆ Y-Chromosome, ఈ X-Chromosome ఆకర్షణ లో పడటమే ప్రేమంటే! అని కాబోలు ఆయన ఉద్దేశ్యం."

"అంటే దానికర్థం?"

"అంటే మగ వారి ప్రేమలో కేవలం ఆకర్షణే ఉంటుందని కాబోలు."

"ఆన్ ది కాంట్రరీ, నేను చదివిన సందర్భం అది కాదు. అక్కడ మగ, ఆడ సంబంధం లేదు. సంతింగ్ ఏదో వేరే ఉద్దేశ్యం ఉంది అని నా అభిప్రాయం."

"ప్రాయం లో ఉండే వారి అభిప్రాయాలు అలాగే ఉంటాయి." మా నాన్నగారి మాటలనే అన్నారీయన. ఈయన మా నాన్నకి స్నేహితుడు. అందుకే ఈ విషయం తెచుకునే దాకా ఈయన్ని నేను వదిలేదు లేదు అని డిసైడ్ అయ్యాను.

"డయలాగ్ సూపర్. విషయమ్లోకి వద్దామా?"

"ఈ మధ్య ఇండియాకి వెళ్ళావా?"

"ఆ వెళ్లాను."

"అక్కడ కొన్ని సంఘటనలు ఆందోళన కలిగించేవి జరిగాయి. అవేంటంటే... ప్రేమించలేదని అమ్మాయిలని కొందరు కుర్రాళ్ళు చంపెశారట!"

"విన్నాను నేను."

"విజయవాడ లో 'శారదా కాలేజి' లో ఒక అమ్మాయిని దారుణం గా నరికి చంపాడుట ఒకడు."

"శ్రీలక్ష్మి ఆ అమ్మాయి పేరు."

"అబ్బో! నీకు తేలుసే!"

"అప్పటికి నేను భారతదేశం లోనే ఉన్నాను."

"అలాంటి వారు చెప్పేది ఒకటే. అమ్మాయిని నేను ప్రేమించాను. ఆ అమ్మాయి నన్ను ప్రేమించి తీరాలి. అలాంటి ప్రేమ పిచ్చి గురించి విమర్శగా అని ఉంటారాయన."

***********************************************************************************

ఆ రోజు నేను ఆయనతో ఈ విషయాలనే చాలా సేపు మాట్లాడాను. ప్రేమంటే ఇంతేనా అనిపించింది. నేను ఇంటికి వచ్చే దారిలో ఒక చిన్న పిల్ల హఠాత్తుగా రోడ్డుకి అడ్డంగా పరిగెత్తింది. ఎందుకా అని నేను చూశాను. అక్కడ ఒక పావురం ఎగరలేక పడి ఉంది. ఆ పిల్ల వెళ్లి దానిని చేతుల్లోకి తీసుకుంది. ట్రాఫిక్ ని లెక్క చేయకుండా! ఎన్నో వెహికిల్స్ ఆగాయి అక్కడ. నేనూ పరిగెత్తుకుని వెళ్లి ఆ పిల్ల ని కలిశాను.

ప్రియ: "why did you risk your life?"

ఆ పిల్ల పేరు Stefanie Larson ట.

Stefanie: "This is a little pigeon. It is unable to fly. Also it can not hint at the traffic to stop. But I can. On seeing my hand signal, the man in the car did what he should do."

ప్రియ: "Nice. Do you love pigeons?"

Stefanie: "No. But I love everything created by the Lord. This is a helpless little creature. I have seen it. So I want to help it. You know, If uou love everything as you, You can have no enemy in the world.


"అసలు ప్రేమంటే ఏమిటి? అది రెండు క్రోమోసోముల మధ్య ఆకర్షణా?" ఇది ఉంది
http://point-blank-questions.blogspot.com/2008/07/blog-post.html అనే లింక్ లో. ఆ బ్లాగ్ నన్ను ఎందుకో కొంత ఆలోచింప చేసింది. ఈ ప్రశ్నని ఆలోచించాల్సిందే.

ప్రియ అయ్యంగార్.

8 వ్యాఖ్యలు:

aswin budaraju on September 15, 2008 10:57 AM said...

baavuMdi mee post

శ్రీకాంత్ వాడరేవు on September 15, 2008 11:16 AM said...

మీటపా బాగుంది

రాధిక on September 15, 2008 1:35 PM said...

బాగుంది.ప్రేమకి అర్ధం మనిషి మనిషికి,సందర్భానికి,బంధానికి,సాంఘిక,ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూవుంటుంది.

Motorolan on September 15, 2008 7:20 PM said...

prEmaMTE "BullShit" :)

కత్తి మహేష్ కుమార్ on September 15, 2008 8:57 PM said...

ఇదే నిజాన్ని కొంచెం కటువుగా చెప్పడానికి ప్రయత్నించి చాలా ఢక్కామక్కీలు తిన్నాను.
http://parnashaala.blogspot.com/2008/06/part-1.html
http://parnashaala.blogspot.com/2008/06/part-2.html


కాకపోతే ఇక్కడ మీరు యవ్వనప్రేమని, విశ్వజనీయమైన ప్రేమనీ కలగలిపి confuse అవుతున్నారు.

క్రోమోజోములగోల యవ్వనప్రేమది. సృష్టిలో ఉన్న అన్ని జీవుల్నీ ప్రేమించేది విశ్వజనీయమైన ప్రేమ. దేనిదారి దానిదే! దేనికున్న విలువదానికే.

@రాధిక: పవిత్రప్రేమ తప్ప మిగతా "రకాల" ప్రేమల్ని అంత సులువుగా అంగీకరించలేనని చెప్పే మీరేనా ఈ మాటన్నాది!!!!

సుజాత on September 15, 2008 9:55 PM said...

విశ్వజనీనమైన ప్రేమను యవ్వనంలో కలిగే ప్రేమావేశంతో పోల్చలేం కదా ప్రియా! ఫ్లారెన్స్ నైటింగేల్ కి రోగుల మీద ఉన్న (సేవా భావంలో కూడిన)ప్రేమను వయసులో ఉన్న ఇద్దరు యువతీ యువకుల మధ్య కలిగే ప్రేమ భావనలతో ఎలా పోల్చగలం?

యవ్వనంలో కలిగే ప్రేమల విషయంలో కూడా ఎన్నెన్ని విభిన్నమైన అభిప్రాయలున్నాయో మన మహేష్ బ్లాగు చూస్తే తెలుస్తుంది. అబ్బ, ఎంత పెద్ద పెద్ద చర్చలు జరిగాయో! ఒక సారి చూడండి, వీలైతే!

టపా బాగుంది.పాప ఇచ్చిన conclusion బాగుంది. సున్నితంగా రాశారు.

MURALI on September 16, 2008 2:53 AM said...

ప్రియా గారు,
మీరు నిజంగానే confuse అయ్యారా? లేక మీరు కూడా కొన్ని విభిన్న సంధర్భాలు చూపించాలనుకున్నారా? క్రోమోజోములతో మొదలుపెట్టి పాప విషయం చెప్పారు. లేదా ప్రేమంటే ఏంటంటే అని ఒక generic definition ఇవ్వాలనుకుంటున్నారా? మీ బ్లాగు కి x,y ల గొడవ తరుచూ వస్తున్నట్టుంది.

swamy on October 18, 2008 6:57 AM said...

ప్రియ గారు..ప్రేమ గురించి పి.హెచ్.డీ.చేసారా?మీ ఆర్టీకల్ బావుంది.నాకు తెలిసి ఎవరైన మనల్ని నిజమైన ప్రేమ అంటే ఏమిటి అని అడిగితే ,మన మనసులొ కలిగే లక్ష భావాల తర్వాత కలిగె సున్యమైన భావనే ప్రేమంటే .దాన్ని పైకి చెప్పలేము..ఫీల్ అవ్వగలం అంతే

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez