Saturday, August 16, 2008

చల్ల చల్లని హాట్ హాట్


షారుఖ్, అమితాబ్ చల్ల చల్లని కూల్ కూల్ అని అంటూ నవరత్న ఆయిల్ యాడ్ లోచెపుతుంటారు. మా చిన్నప్పుడు మేము చేసిన అల్లరి చల్ల చల్ల గా ఉన్నా మాపెద్ద వాళ్లు మాత్రం హాట్ హాట్ గా మారారు. ఏంచేస్తాం? పిల్లల ఉత్సాహాన్నివాళ్లు misunderstand చేసుకుంటారు.

ఒకసారి ఏమయిందంటే అప్పుడు నేనేమో చిన్న పిల్లని. అంటే నాకు సెవెన్ఇయర్స్ ఉంటాయి. నేను సెకండ్ క్లాస్ లో ఉన్నాను. ప్రియా, నేనూ ఒకే క్లాస్.ఒకే బెంచీ. అస్సలు మావేప్పుడూ రెండు కంచాలూ రెండు మంచాలూనూ. అంతఫ్రెండ్షిప్ మాది. వాళ్ల నాన్న మా బాబాయి అన్నమాట. సారీ తమ్ముడి మాట.

ఒక రోజు తెలుగు క్లాస్ లో "ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేకానీ తెలుపు కాదు. పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినరాసుమతీ." పద్యం చెపుతున్నారు. పద్యం చూసి తప్పనుకుంటున్నారా? ఏమోనండీ నీకుచిన్నప్పటినుంచీ ఈ పద్యం ఇలాగే వచ్చు. టీచరు కూడా నాకు వచ్చింది ఇంతే మొర్రో అన్నా కూడా వినిపించుకునేది కాదు.

"టీచర్లందు పున్యవతీ టీచరు వేరయా... విశ్వదాభిరామా నీ వీపు నేను తోమా"అంటూ బెత్తంతో పెళ్లి చేసేది. బాల్య వివాహాలు చట్ట ప్రకారం నేరమనితెలిసినా! వైష్ణవ మాయ.ప్రియకి నన్నెవరన్నా అంటే మహా కోపం. కానీ ఈ విషయంలో ఎవరూ ఏమీ చేయలేరనిఊరుకునేది. టైం బాడ్.

ఒకసారి ఈ పద్యాన్ని పరీక్షల్లో ఇచ్చారు. ఎలాగో ప్రియ చూపించటంతో బ్రతికిబట్టకట్టాను. లేకపొతే ఎలిజబెత్ టేలర్లా పుణ్యవతీ టీచరు నాకు ఎనిమిదోపెళ్లి చేసేది కూడా. సెవెన్ పెళ్ళిళ్ళు జరిగాయి. జస్ట్ రికార్డ్ మిస్సు. నాకప్పుడు బాల్య వివాహాల నిషేధం ఉండేదని అంతగా తెలీదు. ప్రియకీ తెలీదు.మరి దానికే తెలీందే నాకేం తెలుస్తుంది. ఉత్త పిచ్చి మొద్దుని. లేకపొతే ఆ పుణ్యవతీ టీచరు ఆట కట్టిద్దును.

ఈ పరీక్షలో గట్టెక్కిన శుభ సందర్భం లో నేను ఆనందం గా ఉంటే ప్రియకి ఒకబ్రహ్మాండమయిన ఆలోచన వచ్చింది. ఇంకేం! ఒక చారిత్రాత్మకమైన ప్రయోగానికినాంది పడింది. అదేదో గుళ్ళో నంది పరిగెడుతుంది అని బ్రహ్మంగారు చెప్పారుకదా! ఆ రేంజ్ లో నేను ఆత్మ రక్షణకి నేను పరిగెత్తాల్సి వచ్చింది. అంటే వాడెవడో భూత వైద్యుడు నన్ను తరుముతుంటే నా ప్రేతాత్మ ఆంజనేయ స్వామిగుళ్ళో తలదాచుకుంటం కాదు. దెబ్బలు పడకుండా తులసి కోట చుట్టూ, రోడ్డుచివర దాకా పారి పోవటం etc etc అన్నమాట. ఆరోజు ఆదివారం. ప్రియకి ఎప్పుడూ ఏవేవో డౌట్స్. ఎంతసేపూ ఏవేవో ప్రశ్నలువేసి సమాధానాలకోసం విసిగిస్తుంటుంది. ఎవరన్నా ఏ ప్రశ్నల కన్నా సమాధానాలుచెప్పలేక పొతే తనే వాటికి ఏవేవో ఆన్సెర్స్ కని పెడుతుంది.

మన ఎలకతోలు పద్యం ఉందిగా! ఒకరోజు ఎలక తోలు తెల్లగా మార్చలేమా అని డౌట్ వచ్చింది. నాకూ అదే సమస్య చాలారోజుల నుంచీ ఉంది. అస్సలు ఎలకతోలు తెల్లగాఉంటే నాకు ఈ బాల్య వివాహాల గోల తప్పుతుంది కదాని ఆలోచిస్తున్నాను. అంతలోప్రియ ఆ ఫోకాల్ట్ రొటేటింగ్ మిర్రొర్ ఎక్స్పెరిమెంట్ లాటి ఒక అమోఘమైన ప్రొపొసల్ నా ముందుపెట్టింది. అదేంటంటే చల్ల ప్రదేశాలలో ఉండేవాళ్ళు తెల్లగా ఉంటారు కదా. అదేమా ఎక్స్పెరిమెంట్ ప్రిన్సిపుల్.

వెతికి వెతికి చచ్చీ చెడీ ఎలాగో ఒకఎలకని పట్టుకున్నాం. ఇంట్లో ఉన్నా ఎలకల బోనులోని ఎలకని తీయ బోతే అది మాసైంటిస్ట్ మైండ్ తెలిసి చెక్కేసింది. అంటే ఏ చెక్కనీ వేయలేదు. పారిపాయిందన్నమాట.సరే ఎలాగో ఒక ఎలక దొరికిందని సంతోషపడి దాన్ని ఒక కవర్లో పెట్టి దారంకట్టేశాం. తర్వాత దాన్ని ఎలా ఫ్రిజ్ లో పెట్టాలా అని ఆలోచించటంమొదలెట్టాం. ఇలాగే పెడితే అది బయట పడిపోతుంది. ఏంచెయ్యాలి చెప్మా అనినేను ఆలోచిస్తుంటే ప్రియ అంతకు ముందు తనకు వచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ రాపెర్లో చుట్టి ఒక స్వీట్ బాక్స్ లో పెట్టింది. ఎందుకె అని నేను అడిగితె తనుఅవి స్వీట్లని అనుకుని అందరూ తీయరని చెప్పింది.సరే ఎలాగో ఎవరికీ తెలీకుండా ప్రియ దాన్ని ఫ్రిజ్లో ఒకచోట గుట్టుగా దాచిపెట్టినది.

అలా మేము కొన్ని రోజుల పాటూ దాని గురించి పట్టించుకోలేదు. ప్రియ చెప్పిన టైం మినిమం ట్వంటీ డేస్. కానీ ఎలక బతకదు కదా అన్నాళ్ళు. మంచి సమయం మించిన దొరకదు, అనుకుంటూ అది చచ్చూర్కుంది. మా మీద ప్రతీకారం తీర్చుకునేందుకు. ఒహటే వాసన మొదలైంది. మా పిన్నికి ఆ స్వీట్ బాక్స్ మీదే డౌట్. కాక పొతే ప్రియ ఉత్త డబ్బాలని ఒక్కోసారి అందులో పడేసి పెడుతుంది.ఫ్రిజ్ తీసినప్పుడల్లా ఎలక చచ్చిన కంపు. కూల్ అయితే కంపు రాకూదదేమో. కానీ మా ఖర్మ ఒకటే కంపు. One fine morning మా పిన్ని ఆ స్వీట్ బాక్స్ నే తీసింది. అందులో చచ్చిన ఎలక. తనకి మా మీదే డౌట్. అందులో ప్రియ ఎలక తోలు డౌట్ అడిగినప్పటినుంచీ బాగా సైలెంట్ గా ఉంటోంది.

పరిస్తితి చేయి దాటి పోయిందని అర్ధమయ్యి ప్రియ సామాన్లు దింపటానికి పెట్టిన నిచ్చెన మీద నుంచీ అటక ఎక్కి దాక్కుంది. నేనేమో అమాయకంగా పిన్నికి దొరికి పోయాను. హరి హరీ ఎం కొట్టిందిలే. నేను తాళలేక తనని తులసి చెట్టు చుట్టూ తిప్పించాను. నువ్వూ అటక ఎక్కొచ్చు గా! అనొచ్చు.నేను పిన్నికి దొరికి పోయే లోపుల నాయనమ్మ ప్రియని పట్టుకో బోయింది. తనాపాతికే అటక ఎక్కింది. దాంతో చిన్న బాబాయి ని అటక ఎక్కి దాన్ని పట్టుకోమని పురమాయించింది. అతను నిచ్చెన ఎక్కుబోతుంటే ప్రియ నిచ్చేనని తోసేసింది. అది అతని నెత్తి మీద పడింది. అతనేమో వెళ్లి గాస్ పొయ్యి మీద పడ్డాడుదాని మీద ఉన్న నీళ్ళ గిన్నె ఎగిరి నాయనమ్మ కాళ్ళ మీద పడింది. ఆవిడ కుయ్యో మొర్రో. బాబాయి పిర్రలు కాలిపోయాయి. ఎగురుతూ నాయనమ్మ ఆ దెబ్బకి పక్కనే ఉన్న రోట్లో పడింది. దాంట్లో ఉన్న ఇడ్లీ పిండి అంతా ఆవిడ పాలయింది.నేను తులసి చెట్టు చుట్టూ తిప్పుతూంటే పిన్ని ఈ గోలంతా విని లోపలకి రాబోయి ఆ ఒలికిన పిండి మీద కాలేసి జారి పడింది. ఆ జారి పడ్డం లో పిన్ని కాలు కాలిన బాబాయి పిర్రకి తగిలింది. ఇప్పుడు బాబాయి మొర్రో!

నేనీ హడావిడిలో సందు చివరకి పారి పోయి రక్షించే వారి కోసం ఎదురు చూడ సాగాను. ఇంతలో ప్రియా వాళ్ల నాన్న వచ్చాడు. నేనేమో ఏడుస్తూ ఆయన కాళ్ళని చుట్టేశాను.తరవాత ఏమి జరిగిందో నేను చెప్పను. మీరే ఊహించుకోండి.

నాయనమ్మ మాత్రం మన ఇంటా వంటా ఎలకల్ని తినటం లేదు. ఉల్లిపాయే తినం. ఈ ఎలక భాగోతం ఏంట్రా సుందూ! అంటూ బాబాయితో అంది. వినాయక చవితికి మూషిక వాహనం అన్నప్పుడల్లా మా నాయనమంeఎ విషయమే అందరికీ చెపుతుంటుంది.
------------------------------------------------------------------------------------------------

ప్రియ ఇక్కడ నన్ను కొంచం ఇరికించింది. అయినా నాకు దాని మీద కోపం రాదు. ఎందుకంటే దానికి నేనంటే చాలా ప్రేమ. ఒకసారి నాకు ముళ్ళు గుచ్చుకున్నాయి. కొద్దిగా రక్తం వచ్చింది. నేనేడుస్తున్నానని ప్రియకి ఆ ముళ్ళ మొక్క మీద కోపం వచ్చి దాన్ని పీకేద్దామని పాపం రెండు చేతులతో లాగేసే ప్రయత్నం చేసింది. చేతులు రెండూ ముళ్ళు గీరుకు పోయి నాకన్నా పెద్ద గాయాలు అయ్యాయి. అప్పుడది నెప్పితో అరుస్తుంటే నాకెంత జాలి వేసిందో. అదొక్క సారే తను ఏడవటం నేను చూసింది. అందుకే ప్రియ చేతులంటే నాకు చాలా ఇష్టం. అది నా పక్కన ఉన్నప్పుడల్లా దాని చేతులని నా చేతుల్లో పెట్టుకుని చూస్తుంటాను.నన్ను తన బ్లాగులో రాయమంది. అందులో భాగమే ఈ బ్లాగు. నాకు ఇంగ్లీష్ లో బ్లాగడమే అలవాటు. అందుకే కొన్ని ఇంగ్లీష్ పదాలు ఎక్కువ పడుతాయి. నా పేరు వైష్ణవి హరివల్లభ.

వైష్ణవి హరివల్లభ.

8 వ్యాఖ్యలు:

ఏకాంతపు దిలీప్ on August 17, 2008 2:29 AM said...

ప్రియా ప్రశ్నల పరంపర చిన్నప్పుడే మొదలైందన్నమాట!

ఇంతకీ ఆ ఎలుకని తరవాత ఏం చేసారు? తెల్లబడిందో లేదో చూసారా?

srajcanada on August 17, 2008 5:08 AM said...

బాగుంది.

రాధిక on August 17, 2008 6:22 PM said...

:)అమ్మో...మరీ ఇంత అల్లరా?

వైష్ణవి హరివల్లభ on August 18, 2008 8:30 AM said...

@ఏకాంతపు దిలీప్ గారు,

ఎలక ఏమాత్రం తెల్లబడినా ప్రియ ఈ పద్యాన్ని చెప్పనీయదుగా ఇప్పటికీ. Michelson-Morley experiment తో ether ని prove చేయాలని అనుకున్నారు. కానీ అది disprove అయింది. అలాగే మా experiment కూడా ఎలక తోక తెల్ల బడాన్ని disprove చేసింది.

:-)

వైష్ణవి హరివల్లభ on August 18, 2008 8:32 AM said...

@రాధిక గారు,

గడ్డం లేని చంద్రబాబూ, చంద్రుడు లేని చంద్ర గ్రహణం, అల్లరి లేని పిల్లలు ఎక్కడైనా ఉంటారా? అయినా మాది అల్లరి కాదు. చారిత్రిక ప్రయోగం.

:-)

sujji on August 23, 2008 3:54 AM said...

hey.. priya and vishnavy..bagundi mee challa challani hot hot "allari". london lo aekkada untaru meru? we in southall.
anyways, baaga rastunnaru.. carryon..

sujji on August 23, 2008 3:54 AM said...

hey.. priya and vishnavy..bagundi mee challa challani hot hot "allari". london lo aekkada untaru meru? we in southall.
anyways, baaga rastunnaru.. carryon..

Purnima on August 23, 2008 4:48 AM said...

nice one :-)

keep rocking!!

అలా వెళ్ళొచ్చేవి...

  • MOTORCYCLE DIARIES: The Fatal Night - 1 - Dhanaraj Manmadha Says... August 24, 2009, Hyderabad. టైమ్ పదిన్నర కావస్తోంది. "రేయ్ ధనా! మాస్టర్జీ ఫోన్. అర్జంట్. లేవాలి," అమ్మ పిలుస్తుంటే కలత నిద్రలోంచ...
    15 hours ago
  • సెలవురోజులొచ్చాసాయే బ్లాగు! - మరువం తాత్కాలిక విరామం తీసుకోనున్నదిక. ఈ వారం "థాంక్స్ గివింగ్" సెలవులు కనుక కాస్త బయట గాలిపీల్చుకోను వెళ్తున్నాను, ఆపై వృత్తిపర విషయమై తీరిక చిక్కదు కనుక ...
    1 day ago
  • వోట్లు- చెప్పరాని పాట్లు! - "చోద్యం చూస్తారా? కదలి వోటు వేస్తారా?" "మంచివారు వోటు వెయ్యకపోతే దోపిడీదారులదే గెలుపు" "అవినీతి పాలనను అంతమొందించాలంటే ఓటు వేసి తీరాలి" "అవకాశం మీది....
    1 day ago
  • గొడ్డుమాంసం - ప్రజాస్వామిక స్థలాలు - ఇదివరకూ నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఘటన గురించి *"గొడ్డుమాంసం - ఒక సంస్కృతి"* అనే టపా రాశాను. ఎప్పటిలాగే పవిత్రమైన మిత్రులు బాధపడి విబేధ...
    2 days ago
  • బండీ రా.. పొగబండీ రా.. - శీర్షిక చూసిన వెంటనే వంశీగారి జోకర్ సినిమా లో పాట గుర్తు చేసుకుంటూ.. "వీడెవడండీ బాబు పొగబండి అని శీర్షికపెట్టి వోల్వో బస్సు బొమ్మ పెట్టాడు !! పొగబండి అంటే ...
    3 days ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez