Thursday, August 7, 2008

నేనొచ్చేశాను.


ప్రియ మళ్ళీ వచ్చేసింది. అందరికీ స్మైలోదయం. వరుసగా మూడు రోజులు బ్లాగులు రాసింతర్వాత ఒక రోజు ఆంటీల గోల చూశాను. అంతే దెబ్బకి పారిపోయాను. అయినా మధ్య మధ్యలో బ్లాగులు చూస్తూనే ఉన్నా. కొన్నిటిలో కామెంట్లు రాశానుకూడా. ఐతే అవి ఎక్కువగా క్రీడా బ్లాగులు.

అసలు తెలుగు బ్లాగర్లూ! బ్లాగు కి తెలుగార్ధం ఏమిటో పట్టేయ్య రాదూ. బ్లాగ్ ఆంగ్లం ఎందుకు? మన అందరికీ ఇది మెదడుకి మేత. హేమంటార్? :-)

ముందుగా నా బ్లాగుల్లో కామెంట్ లు రాసిన వారికి కృతజ్ఞతలు.

నేను చదివిన బ్లాగుల్లో కొన్ని చాలా బాగున్నాయి. మొదటి బ్లాగులోనే నాకు బాగా నచ్చిన బ్లాగుగురించి ఇచ్చాగా. ఏది నచ్చినా నేను సమీక్ష రాయాలని అనుకుంటున్నాను. కాకపొతే అది ఖచ్చితంగా హాస్య ప్రదంగా ఉండాలి ప్లస్ మంచి విషయాన్ని చెప్పాలి.

ఈ మధ్యనే నేను మహేష్ కుమార్ గారి "కత్తి" లాంటి బ్లాగ్ ని చూశాను. ఆయన చాలా విషయాలని రాస్తున్నట్టున్నారు. మంచి విషయాలని అందిస్తున్నారు. చర్చకి అవకాశం ఉండేలాగా. ఎన్నో రకాల వాదనలని అందులో చూశాను.

మరో మంచి బ్లాగు గీతాచార్య గారిది. మిగతా బ్లాగులతో పోలిస్తే కొన్ని భిన్నం గా ఉన్నాయ్. ఆయనే రాస్తున్న వింబుల్డన్ విలేజ్ చాలా చక్కగా ఉంది. లింక్ wimbledonweekly.blogspot.com

మంచి మంచి కొటేషన్లు, చక్కని క్రీడా విషయాలు, అందించే తీరులోనే కొత్తదనం ఉంది.

అలాగే పూర్ణిమ గారి అల్లరి అదిరింది అందులో కామెంట్ ని రాయలేదు కానీ నాకూ నా చిన్నప్పటి అల్లరి గుర్తు వచ్చింది. కుల పిచ్చి మీద సుజాత గారు రాసిన బ్లాగు నిజం గా wonderful. అందరూ ఆలోచించాల్సిన విషయాలని ఇచ్చారు.

లండన్ లో అందరికీ ఇప్పుడు ఒలింపిక్ ఫీవెర్.

రేపటి నుంచీ నా బ్లాగులు స్టార్ట్ అవుతాయి. రేపే మంచి ఆలోచింపచేసే బ్లాగ్ ఇస్తున్నాను.

ఉంటాను,

ప్రియ. Formerly ప్రియ అయ్యంగార్.

17 వ్యాఖ్యలు:

Purnima on August 7, 2008 10:05 AM said...

పునఃస్వాగతం!! మీ బ్లాగుకోసం మేమూ వేచి చూస్తున్నాము!!

MURALI on August 7, 2008 11:24 AM said...

పునఃస్వాగతం!!

రాజేంద్ర కుమార్ దేవరపల్లి on August 7, 2008 12:03 PM said...

అయ్యంగార్ అలాగే ఉంచండి formerly ఎందుకు??

sujji on August 7, 2008 2:46 PM said...

madam garu... swagatham...

కత్తి మహేష్ కుమార్ on August 7, 2008 9:12 PM said...

మొత్తానికి నా బ్లాగు చదివారన్నమాట!

చైతన్య on August 7, 2008 9:26 PM said...

పునఃస్వాగతం!! తుదుపరి టపాల కోసం ఎదురుచూస్తుంటాను.

శ్రీవిద్య on August 7, 2008 10:22 PM said...

Welcome Back :)

క్రాంతి కుమార్ మలినేని on August 7, 2008 11:12 PM said...

Welcome

గీతాచార్య on August 8, 2008 1:07 AM said...

మీ బ్లాగు గులాబీ పూవులాగా చక్కగా ఉంది. నా గురించి వ్రాసినందుకు థాంక్స్. నా బ్లాగులు నచ్చినందుకు మరో థాంక్స్.

మీ ఫిలాసఫీ బాగుందంటే తక్కువే. నవ్వుతూనే ఉండండి.

కల on August 8, 2008 3:28 AM said...

ఒక సారి గుర్తు చేసుకోండి. బద్రి సినిమాలో M.S. నారాయణ వస్తున్నాడని మల్లిఖార్జునరావు చేసే హడావుడి గుర్తుందా మీకు. బ్యాండుమేళాలు, పూలమాలలు, అబ్బో ఆ కథే వేరు. అలా మీకు స్వాగతం పలుకుతున్నా. జజ్జనక, జజ్జనక, ఢంకుటిక.........

మీనాక్షి on August 8, 2008 4:14 AM said...

welcome priya gaaru...

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ on August 8, 2008 4:40 AM said...

పునఃస్వాగతం!! ప్రియ గారు !!

sravan on August 8, 2008 4:41 AM said...

olympics beijing lo london lo kadandoi..

ప్రియ on August 8, 2008 4:49 AM said...

Ok baba! But sports lovers are having olumpic fever.

ప్రియ on August 8, 2008 4:49 AM said...

@kala garu

If you say so, I'l again stop blogging.:-)

ప్రతాప్ on August 8, 2008 5:09 AM said...

పునఃస్వాగతం.

krishna rao jallipalli on August 8, 2008 11:49 AM said...

మరి ఇంకెందుకు ఆలస్యం.. నవ్వండి.. నవ్వ్హించండి అందర్నీ. (ఈ మద్య కొన్ని బ్లాగులు బోర్ కొడుతున్నాయి సుత్తి తో టపాలని నింపేస్తున్నారు). మీరు నవ్వి, మమ్ముల్ని నవ్వించి.. కొంచం పుణ్యం కట్టుకోండి.

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez