Thursday, June 19, 2008

మైలు దూరం


మా నాన్నకి నన్ను ఏడిపించటం చాలా ఇష్టం. ఎందుకంటే నేను పుట్టినఅప్పుడు తప్ప నా రోదన దర్శన భాగ్యం ఆయనకి కలుగలేదు. అసలు ఏడవటం అంటే నాకు కొంచం నచ్చదు. ఏడ్చి సాధించేది ఏముంది? అని నా అభిప్రాయం. ప్రాయంలో ఉన్నావ్ అభిప్రాయాలు అలాగే ఉంటాయ్ అని నాన్న అనేవాడు . ఏదయితేనేం నాకు ఎడుపంటే యాక్.

అందుకే నేను ఎక్కువగా నవ్వుతుంటాను. అసలు చిరునవ్వుచూస్తే శత్రువైనా కరిగిపోడా. పాపాయిలా బోసి నవ్వులు ఎంత అందంగా ఉంటాయి. అసలు నవ్వే మనిషికి ఆభరణం. చిరునవ్వుతో ఉండే మనిషి ఎంత అందంగా ఉంటాడు! ఒలింపిక్స్లో స్వర్ణం సాధించిన ఆఫ్రికన్ అథ్లెట్ లను చూడండి. ఆ విజయానందంలో ఎంత అందంగా కనిపిస్తారో!

మా నాన్న గారికి కపిల్దేవ్ అంటే ఇష్టం. తనని చూసి స్ఫూర్తి పొందానని అంటుంటారు. ఒకసారి నన్ను ఏదిపిద్దామని "నీ వల్లే కపిల్దేవ్ ఓడిపోయాడు" అని సీరియస్ గా అన్నారు. నేను నా ధోరణిలో "ఎప్పుడు?" అన్నాను. "నువ్వు పుట్టిన తరువాత ఎనిమిది నెలలకి, అందుకే నీతో మాట్లాడటం మానేస్తున్నాను," అన్నారు. "ఎంత దాకా?" అన్నా. "ఎయిట్ మంత్స్," అన్నారు. "అయితే నాకు ఒక కథ చెప్పు," అన్నా. "ఇంకా ఎయిట్ మంత్స్ కాలేదు," అన్నారు. "కపిల్దేవ్ ఓడిపోయి సెవెన్ ఇయర్స్ అయింది. పోదాం పద," అన్నాన్నేను. దాంతో ఆయన పగలబడి నవ్వుతూనే ఉన్నారు అమ్మ వచ్చి విసుక్కున్న దాకా.

పొద్దున్న టీవీలో కపిల్ పోస్టర్ని పీసీయే స్టేడియంలో తొలగించిన న్యూస్ చూస్తుంటే నాకు నాన్న గారే గుర్తుకు వచ్చారు. అనుకోకుండా కళ్లు మసకగా అనిపించి చేత్తో తుడుచుకున్నాను. నేను ఎదుస్తున్నానని నాకు అప్పుడర్ధమయింది. వైష్ణవి చూస్తే ఎక్కిరిస్తుందేమో అని తల విదిలించి ఒకసారి నవ్వాను. ఒకసారి నవ్వాను. అంతే! దిగులంతా పోయింది.

అసలు కపిల్దేవ్ గ్లామర్ అంతా తన 1000 వాట్స్ నవ్వులోనే ఉంది. లేకపోతే అలాంటి మొహం ఉన్న సామాన్యుడు వీధిలో ఉంటే ఎవరైనా చూస్తారా!

అదే అంత నవ్వు ఉంటే ఆ కళే వేరు. అసలు నవ్వంటే గెలుపువల్ల కలిగిన నవ్వు. మన శక్తిని నూరు శాతం ఉపయోగించి ఒక విజయం సాధిస్తే కలిగే ఆనందమే వేరు. కపిల్ నవ్వులో ఆ కళే ఉంది.
మీకో జోక్ చెప్పనా నాన్నారు పోయి ఎనిమిది నెలలే అయింది. హ హ హ. భలే కోయిన్సిడెంట్ కదూ.
దేవుడు నాకు కనిపిస్తే నేను కోరుకునేది "స్వామీ! జీవితంలో ఎప్పుడూ నా మొహంలో చిరునవ్వు పోకుండా చూడు చాలు." అంటా. చెప్పొద్దూ! అసలు మనం నవ్వుతూ ఎ పనిచేసినా అది ఎప్పుడూ విజయమే. కదూ.
తెలుగు బ్లాగర్లకి "వయ్యంటే బిడ్డే" ఉన్న లింక్ annisangathulu.blogspot.com నిన్న నేను రాసిన బ్లాగు లో మెన్షన్ చెయ్యటం మరిచిపోయాను.

అసలు ప్రపంచంలోని అతి పెద్ద పదమే స్మైల్. మరి దాన్ని గౌరవించ వద్దూ. అందకనే మనందరం నవ్వుతూనే ఉందాం.
టా టా!

12 వ్యాఖ్యలు:

రాఘవ on June 19, 2008 4:50 AM said...

మీరు పైకి నవ్వుతూన్నా మీ నాన్నారి గురించి చెప్పి బాధపెట్టారు చివర్లో ;(

కత్తి మహేష్ కుమార్ on June 19, 2008 5:31 AM said...

"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం" అని మన జంధ్యాల ఊరికే అన్నారా!

సిరిసిరిమువ్వ on June 19, 2008 7:04 AM said...

మీ నాన్నగారి గురించి మీరు నవ్వుతూ చెప్పినా చదివేవాళ్ళకి మాకే బాధగా అనిపించింది, ఇక మీకెలా ఉంటుందో.

బాగా రాస్తున్నారు, ఇలానే కొనసాగించండి. కలకాలం ఇలానే నవ్వుతూ ఉండండి.

కొత్త పాళీ on June 19, 2008 12:04 PM said...

sorry to hear about your loss, but this is a fitting tribute to the memory of your father.

Purnima on June 21, 2008 5:01 AM said...

Interesting insight to the laugh. Sorry about your Dad!!

I wonder, how would you react to this post. Care for a look.

http://myimpressions-purnima.blogspot.com/2007/07/gala-gala-paruthunna-godaari-laa.html

చైతన్య on July 6, 2008 8:46 AM said...

చాలా సులభంగా చెప్పారు కాని ఆ విషయం..తేరుకొవడానికి నాకు కొన్ని గంటలు పట్టింది. నిజంగా మీరు అభినందనీయులు ఎల్లప్పుడు నవ్వుతూ వుండడం అనేది దేవుడు ఇచ్చిన ఒక వరం ఇంక చెప్పాలి అంటే అదే మీ బలం . మీరు ఎల్లప్పుడు ఇలాగే నవ్వుతూ వుండాలి అని కోరుకుంటూ...

వేణూ శ్రీకాంత్ on July 13, 2008 6:45 AM said...

నవ్వు గురించి నవ్వుతూ చెప్పి చివర్లో ఏడిపించేసారండీ... అలా ఉండటానికి బోలెడు ధైర్య కావాలి. మీరు ఎప్పుడూ ఇలానే నవ్వుతూ ఉండాలని కోరుకుంటూ...

ఏకాంతపు దిలీప్ on August 6, 2008 4:15 AM said...

ఇది మీరు మీ కన్నీటిని దూరం చేసుకునే ప్రయత్నంలో రాసినది అనిపిస్తుంది.

మీరు మరిన్ని సార్లు నిస్సంకోచంగా ఏడ్వాలని, ఏడుపుని ఆపుకునే ప్రయత్నంలో ఇంకెప్పుడూ మీ కళ్ళు మసకబారకూడదని కోరుకుంటున్నాను...

అలా మీ కళ్ళు మసకబారితే మీకిష్టమైన లోకపు అందాన్ని స్పష్టంగా తనివితీరా చూడలేరు...

ఇంకో విషయం... కన్నీరు కార్చడం అంటే బాధపడటమే కాదు! కన్నీరు కార్చేవాళ్ళు మీకు అలా బాధపడుతున్నట్టు, ఈసురో మంటూ ఉన్నట్టు కనపించవచ్చు...

మీ వయసు 21 అయితే, ఇంకో నాలుగేళ్ళల్లో మీరు మీ అభిప్రాయం మార్చుకుంటారు... అంతవరకూ మీరు నిజాయితీగా ఏడుపు వచ్చినప్పుడు మీ కళ్ళని ఏడవనివ్వండి...

ప్రియ on August 7, 2008 7:37 AM said...
This post has been removed by the author.
ప్రియ on August 7, 2008 7:38 AM said...

పొరపాటున కూడా ఇలాంటి పని చేయను దిలీప్ గారూ! ఇంక ప్రియ జీవించదు అలా ఐతే. I'm too stubborn to change.

చెప్పానుగా ఏడుపంటే యాక్. నేను కన్నీరు దూరం చేసుకునే ప్రయత్నం లో రాసింది ఎంతమాత్రం కాదు. Anyway thanks for your comment.

"మీరు మరిన్ని సార్లు నిస్సంకోచంగా ఏడ్వాలని, ఏడుపుని ఆపుకునే ప్రయత్నంలో ఇంకెప్పుడూ మీ కళ్ళు మసకబారకూడదని కోరుకుంటున్నాను...

అలా మీ కళ్ళు మసకబారితే మీకిష్టమైన లోకపు అందాన్ని స్పష్టంగా తనివితీరా చూడలేరు..."

మీరు ఏ ఉద్దశ్యంతో రాసినా అది నాకు ఎప్పుడూ పడదు. సారీ నా మాటలు మీకు ఇబ్బంది గా ఉండొచ్చు.

ఏకాంతపు దిలీప్ on August 7, 2008 8:27 AM said...

:-)

ఏడుపంటే యాక్ అనే మొదటి అమ్మాయిని చూస్తున్నాను...

నాకేమి ఇబ్బంది ఉంటుంది... ఏమీ ఉండదు...

It is just an interpretation and approach to tears.

మీరు ఇలానే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను.. కానీ ఏడ్వడం తెలిస్తే మీరు మరింత ఆనందంగా ఉండగలరు...

గీతాచార్య on August 8, 2008 1:15 AM said...

ఎన్నాళ్ళకెన్నాళ్ళకు! మీ తీరు ముచ్చటగా ఉంది. నవ్వటం గురించి ఇంత stubborn గా చెప్పిన అమ్మాయిని చూసి చాలా రోజులైంది. (మీ పై కామెంట్ ని చదివాను).

మీ స్టైల్ బాగుంది. నా బ్లాగులన్నిటినీ చదివినట్లున్నారు? థాంక్స్.

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez