Wednesday, June 18, 2008

నేనొక బ్లాగుని చూశాను.


సెలవల్లో ఇండియాకి (క్షమించాలి భారతదేశం) వచ్చినప్పుడు మా ఫ్రెండ్ వైష్ణవి బ్లాగులు రాయటం చూసాను. అంతకు ముందు సెల్వి (లండన్ లో ఫ్రెండ్) నన్ను కూడా బ్లాగులు రాయమంది. అదో సుత్తి అని నేను మొదలెట్టలేదు.

ఒకరోజు వైష్ణవి బ్లాగు రాస్తుంటే బోరుగా ఉన్నా నేను కూర్చున్నాను. ఇంతలో తను తెలుగులో కూడా బ్లాగు రాయవచ్చు అని చెప్పింది. అది వినగానే నాకు ఇంట్రెస్ట్ పుట్టుకు వచ్చింది. దాంతో నేను ఒక ఎకౌంటు తయారు చేసుకున్నాను. రాద్దామనుకునేంతలో కరెంటు పోయింది. మంచి శకునం మించిన దొరకదు అని నేను బ్లాగు రాయటానికి డిసైడ్ అయ్యాను. అయితే అప్పుడు బయటకు వెళ్ళవలసిన పని ఉండటంతో నాకు ఆరోజు కుదరలేదు.

మొత్తానికీ నేను కూడా బ్లాగు రాసాను. కూడలిలో పెట్టాను. అయితే రాసేముందు కొన్ని బ్లాగులని చదివితే బాగుంటుంది అని నేను అడిగితే వైష్ణవి కొన్ని బ్లాగులని చూపించింది. అవి కొన్ని పాతవి, కొన్ని కొత్తవి. చదివిన వాటిల్లో చాలావరకూ బాగానే ఉన్నాయి. ముఖ్యంగా జ్యోతి గారివి, క్రాంతి గారివి. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లుగా నేను చాలా సేపు బ్లాగులని చూసాను. వైష్ణవి ఆంగ్లంలో రాస్తుంది. ఎన్నెన్నో బ్లాగులు. అందులో కొన్ని మరీ కొత్తవి కొన్ని మరీ పాతవి. అన్నీ వేటికవే బాగున్నాయి.

కొన్ని సంఘటనలు హఠాత్తుగా జరుగుతాయి అంటారు. ఇంక సిస్టం షట్ డౌన్ చేద్దాము అనుకుంటుంటే ఒక బ్లాగు కనిపించింది. సత్యమేవ జయతే అని హెడ్డింగు ఉంటే ఏదో బోరు బాపతే అనుకుని క్లోజ్ చెయ్య బోయాను. అంతలో నాకు ఒక ఫోటో కనిపించింది. అది కృష్ణస్వామి అల్లాడి ది. ఆయన ఎవరంటే Matscience vyavasthaapakulaina వ్యవస్థాపకులైన అల్లాడి రామ కృష్ణన్ గారి అబ్బాయి. వారు మా నాన్నగారికి గురువుగారట. అల్లాడి కృష్ణస్వామి University of Florida లో Professor and Chair, Department of Mathematics. ఆయన గురించి నాకు కొద్దిగా తెలుసు. ఆయన గురించి రాసారేమో అనో ఆ బ్లాగు చదివాను.

దాని కింద ఉన్నా శీర్షిక నన్ను ఆకర్షింది. అది "వయ్యంటే బిడ్డే." దాని కింద "అమ్మ" అని ఇంకో శీర్షిక. అమ్మ బాగుంది. అంతే. బాగుంది. చాలా బాగుంది అని మాత్రం చెప్పను. కానీ చదవాల్సిన అంశమే ఉంది అందులో. కానీ నన్ను పడగొట్టింది మాత్రం వయ్యంటే బిడ్డే. ప్రారంభం నుంచీ ముగింపు దాకా ఎక్కడా ఆగకుండా నేను చదివాను. అద్భుతం అనిపించింది.

ఆడ పిల్లలు పుడితే అత్తగారు, మొగుడు పెట్టె హింసలగురించి. కేవలం అదే అయితే నేను ఈ బ్లాగుని రాయనవసరం లేదు. అసలు రాసేదాన్ని కాదు.

ఎంతో పెద్ద సమస్యని చాలా చిన్న కథలో హాస్యస్ఫోరకంగా చాలా చక్కగా చెప్పారు. కథలోని ప్రతి వాక్యం కూడా ఎంతో ఇంటిగ్రేట్ అయి ఉన్నది. ప్రారంభం నుంచీ ముగింపు దాకా కథలో ఇంటిగ్రిటి ఉంది. ఒక రొమాంటిక్ కామెడీని రాసినట్లుగా రాశారు. కానీ అసలు సమస్యని మరుగున పడవెయ్యలేదు. అసలు పాయింట్ని చెంప చెళ్ మనిపించేలాగా చాలా సూటిగా చెప్పారు. ఎక్కడయితే చెప్పాలో అక్కడే ఆ పాయింట్ని చెప్పారు. కేవలం ఒకే వాక్యం కథ మొత్తానికీ ప్రాణం. అది చాలా బాగా పడింది.

మొదట్లో నారేటర్ భర్త నవ్వటం, చివరలో అత్తగారు నవ్వటం what a beautiful link?

ప్రతి ఒక్కరూ చదవాల్సిన కథ అది. అందుకే అది అందరూ చదవాలని ఈ బ్లాగు రాస్తున్నాను.
గీతాచార్య గారికి అభినందనలు.

ఇక నా మాటలు. ఈసురోమంటూ ఉన్దేతట్లయితే ఈ జీవితం ఎందుకు. జీవితం నందనవనం లాంటిది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రతి క్షణం మనకోసమే అన్నట్లు ఉండాలి. ఆ బ్లాగరి కూడా అందువల్లే కథను ఇలా రాసుంటారు. అంత సీరియస్ పాయింట్ని తీసుకుని చాలా చక్కని హాస్యం తో రాసినందువల్లె నాకు ఆ కథ నచ్చింది.

మా ఇంట్లో అందరూ దీన్ని చదివారు. నా అభిప్రాయంతో ఏకీభవించారు.

5 వ్యాఖ్యలు:

కొత్త పాళీ on June 18, 2008 9:55 AM said...

1. బ్లాగులోకానికి స్వాగతం.
2. బ్లాగరు ఎకౌంటు తీస్కోగానే కరంటు పోతే మంచి శకునం అన్న సెంటిమెంటు అద్భుతం.
3. అల్లాడి .. సత్యమేవజయతే గురించి రాసినందుకు సంతోషం. లింకివ్వడం మరిచారు.

మేధ on June 18, 2008 8:22 PM said...

ప్రియ గారు, బ్లాగ్లోకానికి స్వాగతం... :)
కొత్తపాళీ గారన్నట్లు కధకి లింక్ ఇవ్వడం మరిచారు.. అంతగా ఆ కధ వివరించి, లింక్ ఇవ్వకపోతే ఎలాగండీ...?!

కత్తి మహేష్ కుమార్ on June 18, 2008 10:32 PM said...

కథ కు లింకేదీ?

చైతన్య on June 19, 2008 12:40 AM said...

బ్లాగు లోకానికి స్వాగతం

ప్రియ on June 19, 2008 1:55 AM said...

ఆ బ్లాగు లింక్ ఇవ్వటం మరిచిపోవటం ... సారీ! annisangathulu.blogspot.com

అలా వెళ్ళొచ్చేవి...

  • మిగిలిన ప్రశ్న - రాలు పూలలో రాలిన ఆశలు వాలు కనులలో రంగుల కలలు చూడని కన్ను ఏది? కదలని కాలంలో రేయి నిట్టూర్పులు, వదలని మోహంలో వేయి వేడుకలు కాంచని హృది ఏది? నివురుకమ్మిన వేకు...
    7 hours ago
  • ప్రియ - Ralph Elison's Invisible Man - Bad gal* ప్రియ* అందించిన ఆణిముత్యం.. దీనికోసం ఎన్నిరోజులనుండి షంటబడిందో ;) ఇంతకు మునుపు మనకి ఉక్రేనియన్ జానపద గాధలను గురిమ్చి చెప్పిన ప్రియ ఈ సారి కాస్త...
    23 hours ago
  • సరితా దేవి డైరీ-సరోజ డైరీ! - కుటుంబ రావుగారి గురించే రాసేంత సామర్థ్యం నాకు లేదని నా స్థిరాభిప్రాయం. కాకపోతే ఇది నా బ్లాగు కాబట్టి ఆయన గురించి నాకు తోచిన నాలుగు మాటలు రాసుకుని ఒక చిన్న నవ...
    4 days ago
  • ఎవరికి ఏహక్కుంది: ఒక కుట్ర - మహిళల హక్కులకోసం పోరాడాలంటే మహిళే అయ్యుండఖ్ఖరలేదు. ఫెమినిస్టు అంతకన్నా అయ్యుండఖ్ఖరలేదు. మనిషైతే చాలు. దళితసమస్యని తీర్చడానికి పోరాటం దళితులే చెయ్యనఖ్ఖరలేద...
    1 week ago
  • Wake Up SID !! - నేను సాధారణం గా హిందీ సినిమాలు చూసేది అతి తక్కువ... ఇంచుమించు రిలీజైన ప్రతి తెలుగు సినిమా చూసే అలవాటున్న నేను హిందీ సినిమా విషయానికి వచ్చేసరికి మరీ బాగుంది...
    4 weeks ago
  • హమార బజాజ్ - ఒకరోజు మధ్యాహ్నం నేను నిద్రలేచి చూసేసరికి మాఇంటి వరండాలో అంతా హడావిడిగా ఉంది.అమ్మ,నాన్న,ఇందిరత్తయ్య మాటలు వినిపిస్తున్నాయి.ఆ నిమ్మకాయల మధ్యలో మిరపకాయలు కూడ...
    9 months ago

తెలుగు వీర

 

ప్రియ రాగాలు Copyright © 2008 Green Scrapbook Diary Designed by SimplyWP | Made free by Scrapbooking Software | Bloggerized by Ipiet Notez